Saturday, May 18, 2024
- Advertisement -

నారావారూ………. ఎన్టీఆర్ పరువు ఎందుకు తీస్తారు? పాపం కాదూ?

- Advertisement -

నమ్మి చేరదీసి……. కూతురుని ఇచ్చి పెళ్ళి చేసి……. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ….. ప్రత్యర్థి పార్టీలో ఉండి ఎన్టీఆర్‌నే ఓడిస్తా అని ఛాలెంజ్‌లు విసిరినప్పటికీ…….. పెద్ద మనసుతో చంద్రబాబును మంత్రిని చేశాడు ఎన్టీఆర్. ఆ తర్వాత చంద్రబాబుకు అన్నీ ఇచ్చాడు. కానీ చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి లాక్కున్నాడు. ఇక ఆ తర్వాత పార్టీ, నిధులు, పార్టీ గుర్తు…… ఒకటనేముంది….. అన్నీ లాగేసుకున్నారు. ఎన్టీఆర్‌పై చెప్పులేయించారు…….ఎన్టీఆర్‌కి విలువలు లేవు అని జాతీయస్థాయి మీడియాతో చెప్పాడు చంద్రబాబు. ఆ తర్వాత మానసిక క్షోభతో ఎన్టీఆర్ చనిపోయాడు.

బ్రతికుండగా ఎన్టీఆర్‌కి నరకం చూపించినవాళ్ళే…… ఆయన చనిపోయిన మరుక్షణం నుంచీ ఎన్టీఆర్ ఇమేజ్‌ని ఓన్ చేసుకున్నారు. సంకట స్థితి వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆయన పేరు చెప్పుకునే బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఆ జోరు మరీ ఎక్కువైంది. ఎన్టీఆర్ మనవడిగా గుర్తించబడాలని నారా వారి అబ్బాయి లోకేష్ నానా తంటాలూ పడుతున్నాడు. అంతవరకూ బాగానే ఉన్నా లోకేష్‌ని మించిన అవినీతి పరుడు లేడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతిప్రదేశ్‌గా చేశాడు లోకేష్ అని పవన్‌తో సహా రాజకీయ మేధావులు చాలా మంది విమర్శిస్తూ ఉంటే తనను తాను సమర్థించుకోవడానికి ఎన్టీఆర్ పేరు అడ్డుపెట్టుకుంటున్నాడు లోకేష్. తన తాత ఎన్టీఆర్‌కి మనవడిగా ……. తాతలాగే తాను కూడా ఎప్పుడూ తప్పు చేయనని అంటున్నాడు. ఈ విషయంపైనే కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ గురించి తెలియని ఈ తరం జనాలు…….. ఓహో…….. అప్పట్లో ఎన్టీఆర్ కూడా లోకేష్‌లానే చేేసేవాడా అని భావిస్తే ఎన్టీఆర్ ఇమేజ్ డ్యామేజ్ కావడం ఖాయం.

ఇక చంద్రబాబు కూడా ఏమీ తక్కువ తినలేదు. ఎన్టీఆర్ హయాంలో టిడిపి జాతీయ స్థాయిలో ప్రధాన పాత్ర పోషిస్తే ఆ క్రెడిట్ మొత్తం తన అకౌంట్‌లో వేసుకుంటున్నాడు. ఇందిరాగాంధీలాంటి అత్యంత శక్తివంతురాలైన భారతదేశ ప్రధానిపై పోరాటం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. నాలుగేళ్ళపాటు బానిసలాగా మోడీ దగ్గర ఊడిగం చేసిన చరిత్ర చంద్రబాబుది. అలాంటి చంద్రబాబు కూడా ఎన్టీఆర్‌లాగే తలవంచను…….పోరాడుతా అని అంటూ ఉంటే కూడా ఎన్టీఆర్ ఇమేజ్ డ్యామేజ్ కావడం ఖాయం అనిపిస్తోంది. అయినా అన్ని పథకలకూ చంద్రన్న అని తనపేరు పెట్టుకుంటూ రాజకీయంగా అవసరమైనప్పుడు మాత్రం ఎన్టీఆర్ పేరు అడ్డుపెట్టుకుని ప్రజల్లో కాస్త మంచి పేరు తెచ్చుకుందామని చంద్రబాబు ప్రయత్నం చేస్తూ ఉండడం మాత్రం కృతకంగా ఉంది.

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ……… నిప్పులా బ్రతికిన చరిత్ర ………దేశంలోనే నా అంత సీనియర్ నాయకుడు లేడు అని తన గురించి తానే చెప్పుకునే చంద్రబాబు……..ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ పేరు వాడుకోకుండా ప్రజల అభిమానం పొందలేకపోవడం చూస్తుంటే ఆయన స్థాయి ఏంటో తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌తో సహా నందమూరి వారసులందరూ కూడా ఎన్టీఆర్ పేరును క్యాష్ చేసుకోవడం తప్పుగా భావించి ఎప్పటి నుంచో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు మాత్రం అన్ని అడ్డమైన విషయాల్లోనూ ఆయన పేరును వాడేస్తూ ఆయన ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తున్నారని ఎన్టీఆర్ అభిమానులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -