Monday, April 29, 2024
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ 48 గంటల డెడ్‌లైన్‌..

- Advertisement -

ఏపీ ప్ర‌భుత్వానికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ డెడ్‌లైన్ విధించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన బ‌హిరంగ‌స‌భ‌లో టీడీపీనీ టార్గెట్ చేసిన ప‌వ‌న్ ఆదిశ‌గా వెల్తున్నారు. ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పిదాల‌పై త‌న పోరాటాన్ని ముమ్మ‌రం చేశారు. తాజాగా గుంటూరులో డయేరియాతో బాధపడుతూ జీజీహెచ్‌ లో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ కల్యాణ్ పరామర్శించారు.

ప్రభుత్వం తక్షణమే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. డయేరియా మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం 48 గంటల్లో స్పందించకపోతే రాష్ట్ర బంద్‌ కు పిలుపునిస్తానని అల్టిమేటం జారీ చేశారు. దీనిపై అవసరమైతే దీక్షకు దిగుతానని ఆయన ప్రకటించారు. అవ‌స‌రం అయితే అవసరమైతే దీక్షకు దిగుతానని ఆయన ప్రకటించారు.

రాష్ట్రంలో సురక్షితమైన తాగునీటిని ప్రజలకు ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీ ఇంట్లో వాళ్లు చనిపోతే ఇలాగే స్పందిస్తారా? అంటూ ఆయన అధికార పక్షాన్ని నిలదీశారు. ఇక్కడి ప్రజాప్రతినిధులకు సమస్యలు పట్టవా? అని అడిగారు. చ‌నిపోయిన వారికి త‌క్ష‌ణ‌మే న్యాయం చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -