మధుమేహం ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

Precautions to be Taken For Diabetes
Precautions to be Taken For Diabetes

ఒక వ్యక్తి ఆరోగ్యంపై మధుమేహం యొక్క ప్రభావాలను తగ్గించటానికి సహాయపడే చికిత్సలు మరియు జీవనశైలి మార్పులను సమీక్షిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

మధుమేహం అనేది రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేసే మరియు బాగా నిర్వహించకపోతే చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే ఒక పరిస్థితి. షుగర్‌ వ్యాధిని ఎంత అర్థం చేసుకుంటే, ఆ వ్యాధి వలన కలిగే ఉపద్రవాలను అంత ఎక్కువగానూ, అంతకన్నా ముందుగా అపోహలను సరిదిద్దుకోవలసి ఉంది.

*షుగర్ వ్యాధి ఉన్న వారు పాదాలను అపురూపంగా చూసుకోవాలి. కనుక సౌకర్యంగా ఉన్న పాదరక్షలను ధరించాలి. వ్యాయామానికి ముందు, తర్వాత బ్లడ్ గ్లూకోజ్ చెక్ చేసుకోవాలి. దీనివల్ల వ్యాయామం ఎంత మేరకు చేయాలన్న విషయమై చక్కటి అవగాహన ఉంటుంది.

*లో బ్లడ్ షుగర్ అనేది హై బ్లడ్ షుగర్ (హైపో గ్లైసేమియా) కంటే అత్యంత ప్రమాదకరమని వైద్యులు చెబుతుంటారు. అందుకని వ్యాయమానికి బయల్దేరే ముందు మధుమేహులు కాస్తంత స్నాక్స్ తీసుకోవాలి. లేదా క్యాండీస్, గ్లూకోజ్ బిస్కట్లు, జ్యూస్ వంటివి వెంట తీసుకెళితే షుగర్ తక్కువైపోయి అత్యవసర పరిస్థితి ఏర్పడితే తీసుకునేందుకు అనువుగా ఉంటాయి.

*డయాబెటిక్ న్యూరోపతి సమస్య ఉన్నవారు దూకడం (జంపింగ్) వంటి పనులకు దూరంగా ఉండాలి. పాదాలకు గాయాలు కాకుండా చూసుకోవాలి. సింపుల్ ఎక్సర్ సైజ్ లు వీరికి మంచిది.

*రోజుకు కనీసం పదివేల అడుగులు వేసేలా ప్లాన్ చేసుకోండి. వ్యాయామానికి వెళ్లేటప్పుడు మీ వివరాలను తెలిపేలా, అత్యవసర సందర్భాల్లో సంప్రదించాల్సిన వారి నంబర్ తో ఓ ఐడీ దగ్గర ఉంచుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

క్యాన్సర్ ను తరిమికొట్టే నల్ల పుట్టగొడుగులు

సరిగా నిద్రపోవడం లేదా..? అయితే మీకు..!

మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు!