Friday, May 3, 2024
- Advertisement -

ఈ నటీనటులకు ఏం లోపాలు ఉన్నాయో తెలుసా..?

- Advertisement -

నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద హల్ చల్ చేస్తున్న రానా దగ్గుబాటి.. బాహుబలి సినిమాలో భల్లాల దేవుడిగా నటించి ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇతనికి కూడా ఒక అంగవైకల్యం ఉంది. అదేంటంటే.. ఇతనికి కుడికన్ను కనిపించదు. ఒక్క ఎడమ కన్నుతోనే చూస్తాడు కానీ ఎప్పుడూ నిరుత్సాహపడలేదు.

అయితే ఎల్ వీ ప్రసాద్ హాస్పిటల్ లో చనిపోయిన ఒక దాత కన్నును దానం చేస్తే.. దాన్ని రానాకు అమర్చారు. ఇక అభినయ అనే నటి కూడా పుట్టుకతో చెవిటి మూగ.. కానీ ఆమె తన అంగవైకల్యాన్ని జయించి తెలుగు, కన్నడ, తమిళ, హిందీ లాంటి అనేక భాషల్లో నటిస్తూ అనేక మంది ప్రేక్షకులను సంపాధించుకుంది. అసలు ఆమెను చూస్తే అంగవైకల్యం ఉందని ఎవ్వరు కూడా కనిపెట్టలేరు. హీరో నితిన్ కు కూడా నత్తి ఉంది. కెరియర్ తొలిరోజుల్లో శివాజీ చేత డబ్బింగ్ చెప్పించుకున్నాడు. శ్రీ ఆంజనేయం చిత్ర నిర్మాణ సమయంలో కృష్ణవంశీ పట్టుబట్టి ఆయనతోనే డబ్బింగ్ చెప్పించాడు.

ఇక రాను రాను తన సినిమాలకు తానే డబ్బింగు చెప్పుకుంటూ సక్సెస్ తో దూసుకెళ్తున్నారు. ఇక కమెడియన్ అలీకి కూడా నత్తి ఉంది కాని అది ఎక్కడ బయటపడకుండా తన డైలాగు డెలివరీ టైమింగ్ తో ఒత్తి పలుకుతూ.. ఆ లోపం కనిపించకుండా జగ్రత్త పడుతారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -