Friday, May 3, 2024
- Advertisement -

ఎంపీగా పోటీ….

- Advertisement -

రాజ‌కీయాల‌కు…సినిమాల‌కు అవినాభావ సంబంధం చెప్ప‌లేనిది. ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కు సినీ గ్లామ‌ర్ పెరుగుతోంది.సినిమా రంగంనుంచి వ‌చ్చి ముఖ్య‌మంత్రులు అయిన వారు దేశంలో చాలా మంది ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో క‌న్న‌డ స్టార్ న‌టుడు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాడు.భాజాపానుంచి పోటీ చేసేందుకు ఉవ్వీల్లూరుతున్నారు.

శాండల్‌వుడ్‌లో రియల్‌స్టార్‌గా పేరుగాంచిన ఉపేంద్ర రాజకీయ రంగ ప్రవేశంపై కన్నడనాడులో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో ఉపేంద్ర తన సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుత రాజకీయాలపై తన వైఖరిని తెలియజేస్తూ ట్వీట్‌లు పెడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరిపాలనా తీరుపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపేంద్ర భారతీయ జనతా పార్టీలో చేరుతార‌నే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

నేడు తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు సమాచారం. ఇదే రోజు బెంగళూరు రానున్న జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో సాయంత్రం 6.15 గంటలకు భేటీ అయ్యేందుకు ఉపేంద్రకు ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా బీజేపీలో చేరతారని, లోక్‌సభ ఎన్నికల్లో మండ్య లోక్‌సభ స్థానానికి బీజేపీ తరపున బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది.

అయితే ఉపేంద్ర బీజేపీలో చేరతారా లేక ఆంధ్రప్రదేశ్‌లో పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్‌ తరహాలో సొంత పార్టీ ఏర్పాటు చేస్తారా అన్న విషయంపై స్పష్టత రాలేదు. ఏది ఏమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సినీ గ్లామ‌ర్ మ‌రింత పెర‌గ‌నుంద‌న‌డంలో సందేహంలేదు.ఉపేంద్ర బాట‌లో ఇంకెంత మంది ఉన్నారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -