జక్కన్న సినిమా బాహుబలి లో మొట్ట మొదట గా విడుదల చేసిన పోస్టర్ ని ఎవ్వరూ ఎప్పటికీ మరచిపోలేరు. చంటి బిడ్డ ని చేత్తో ఎత్తుకున్న శివగామి నదిలో ఉన్న లుక్ అప్పట్లో సంచలనం సృష్టించింది. సినిమా లో కూడా శివగామి తనని తాను ఆహుతి చేసుకుని మరీ బిడ్డను కాపాడుతుంది. సినిమా మొత్తానికీ అదే ఆయువు పట్టు ఐ చెప్పాలి . చిత్ర కథకి మూలాధారం అయిన ఆ సన్నివేసం మరపురానిది.
అయితే అచ్చం అలాగే తన ప్రాణాలు పోతున్నా కూడా తన కొడుకు మాత్రం బతికి తీరాలి అనుకుంది ఒక తల్లి. శివగామి లాగానే కొడుకుని మాత్రం అతికష్టం మీద ఒడ్డుకి చేర్చి తాను మాత్రం ప్రాణాలు వదిలేసింది. మాత్రు ప్రేమకి నిదర్సనం గా ఈ ఘటన చిత్తూరు లో జరిగింది.
చిత్తూరు జిల్లా దిగువ కన్ని కాపురం గ్రామం లో రామ కృష్ణ అనే వ్యక్తి బెంగళూరు లో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆయన భార్య భువనేశ్వరి మాత్రం గ్రామం లో ఉంటూ పశువులను కాశ్తోంది రెండేళ్ళ కుమారుడు కూడా వీరికి ఉన్నాడు.
బిడ్డ తో సహా పశువులు కాసే సమయం లో అడవి వద్దకి వెళ్ళగా అటవీ అధికారులు తవ్విన కందకం పూర్తిగా నీటిలో మునిగిపోయంది. చూసుకోకుండా అందులోకి దిగిన ఆమె బాగా లోతు ఉండడం తో క్రమ క్రమంగా నీళ్ళలో మునిగిపోయింది ఈ ప్రమాదాన్ని గమనించిన భువనేశ్వరి తన ప్రాణాలు పోయినా బిడ్డ ప్రాణాలు కాపాడింది .