Friday, April 26, 2024
- Advertisement -

సినిమాల్లో నటించి ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు..!

- Advertisement -

సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించి.. రియల్ లైఫ్ లో పెళ్లిలు చేసుకున్న జంటలను ఇప్పుడు చూద్దాం.

1) కృష్ణ – విజయ నిర్మల:

‘సాక్షి’ చిత్రంలో జంటగా నటించిన కృష్ణ, విజయ నిర్మల.. ప్రేమ పడ్డారు. అప్పటికే వీరికి పెళ్ళైనప్పటికీ మళ్ళీ వివాహం చేసుకుని ఒకటయ్యారు. ఇంకా ఎన్నో చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించారు.

2) శ్రీకాంత్ – ఊహ:

‘ఆమె’ చిత్రం టైంలోనే శ్రీకాంత్, ఊహ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ళ తరువాత పెళ్లి చేసుకుని జంటగా మారారు.

3) రాజశేఖర్ – జీవిత:

‘తలంబ్రాలు’ ‘అంకుశం’ వంటి చిత్రాల్లో భార్యా భర్తలుగా నటించిన రాజ శేఖర్, జీవిత లు.. ఆ తరువాత నిజంగానే పెళ్లి చేసుకుని జంటగా మారారు.

4) నాగార్జున – అమల:

‘శివ’ ‘నిర్ణయం’ వంటి సినిమాల్లో జంటగా నటించిన నాగార్జున- అమల నిజ జీవితంలో కూడా వివాహం చేసుకుని జంటగా మారిన సంగతి తెలిసిందే.

5) మహేష్ బాబు – నమ్రత:

‘వంశీ’ సినిమాలో జంటగా నటించిన మహేష్, నమ్రత.. నిజజీవితంలో కూడా పెళ్లి చేసుకుని జంటగా మారిరారు.

6) శివ బాలాజీ – మధుమిత:

ఓ తమిళ్ సినిమాలో జంటగా నటించిన వీరిద్దరూ.. నిజజీవితంలో కూడా పెళ్లి చేసుకున్నారు.

7) వరుణ్ సందేశ్ – వితిక షెరు:

‘పడ్డానండీ ప్రేమలో మరి’ సినిమాలో జంటగా నటించిన వీరిద్దరూ నిజంగానే ప్రేమలో పడి.. తరువాత పెళ్లి చేసుకుని జంటగా మారారు.

8) నాగ చైతన్య – సమంత:

‘చైసామ్’ ఈ కపుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఏమాయ చేసావే’ ‘మనం’ చిత్రాల్లో జంటగా నటించిన ఈ జంట.. నిజ జీవితంలో కూడా పెళ్లి చేసుకున్నారు.

9) పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్:

‘బద్రి’ ‘జానీ’ సినిమా టైంలోనే ప్రేమలో పడిన ఈ జంట.. తరువాత కొన్నాళ్ళకు పెళ్లి చేసుకున్నారు. అయితే అటు తరువాత విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే..!

10) ఆర్య – సయేషా సైగల్:

సయేషా ‘అఖిల్’ అనే తెలుగు చిత్రం ద్వారానే హీరోయిన్ గా మారింది. హీరో ఆర్య గురించి మనకు తెలిసిందే. వీళ్ళిద్దరూ ‘గజినీకాంత్’ అనే చిత్రంలో జంటగా నటించి.. నిజ జీవితంలో కూడా పెళ్లి చేసుకుని జంటగా మారారు.

11) సూర్య – జ్యోతిక:

‘కాకా కాకా’ అనే చిత్రంలో జంటగా నటించిన సూర్య, జ్యోతిక ఆ తరువాత.. నిజంగానే పెళ్లి చేసుకుని జంటగా మారారు.తరువాత ‘నువ్వు నేను ప్రేమ’ అనే చిత్రంలో కూడా వీరు భార్యా భర్తలుగా కనిపించారు.

12) అర్జున్ షార్జా – నివేదిత:

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యాక్షన్ కింగ్ అర్జున్ కూడా తన సినిమాలో హీరోయిన్ గా నటించిన నివేదితను పెళ్లి చేసుకున్నాడు.

అమల గురించి ఎవరికి తెలియని విషయాలు..!

మన యాంకర్స్ ఈవెంట్ కి ఎంత తీసుకుంటారంటే ?

మహేష్ వదిలేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

సాగునీటి ప్రాజెక్టులపై బాబు శీతకన్ను

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -