- Advertisement -

సిగరేట్ తాగుతున్నారా..అయితే?

- Advertisement -

పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలిసిందే. సాధారణంగా ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్‌లకు కారణమవుతుందని చెబుతారు. కానీ దీనికి మరో ముఖ్యమైన దుష్ప్రభావం కూడా ఉంది – ఎముకలపై తీవ్ర ప్రభావం.

పొగ తాగడం ఎముకల బలం తగ్గించి వాటిని మరింత బలహీనంగా, సున్నితంగా మారుస్తుంది. దీనివల్ల ఫ్రాక్చర్ ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.పొగ తాగడం వల్ల ఎముకల సాంద్రత (Bone Density) తగ్గిపోతుంది. ఎముకలు బలహీనంగా మారుతాయి.చిన్న గాయంతో కూడా విరిగే అవకాశం ఉంటుంది.సాధారణంగా పడిపోవడం వల్ల కూడా ఫ్రాక్చర్ అవుతుంది.

ప్రత్యేకంగా, పొగ తాగే వారికి హిప్ ఫ్రాక్చర్ వచ్చే ప్రమాదం పొగ తాగని వారితో పోలిస్తే దాదాపు రెండింతలు ఎక్కువగా ఉంటుంది.పొగ తాగడం ఎముకల నిర్మాణ ప్రక్రియను నేరుగా ప్రభావితం చేస్తుంది.

పొగ తాగడం వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. ఎముకల క్షయం వేగంగా జరుగుతుంది. కాల్షియం శోషణ తగ్గిపోతుంది.దీంతో కాలక్రమంలో ఎముకలు నిశ్శబ్దంగా బలహీనపడతాయి. పొగ తాగడం కేవలం ఊపిరితిత్తులు లేదా గుండెపైనే కాకుండా ఎముకలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అయితే సరైన సమయంలో ఈ అలవాటు మానేస్తే ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -