Thursday, April 18, 2024
- Advertisement -

సౌందర్య వందల కోట్ల ఆస్తులు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసా ?

- Advertisement -

సౌందర్య.. పరిచయం అక్కర్లేని నటి. ఎంతో మంది అభిమానులను సంపాధించుకున్న ఈ హీరోయిన్ 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది. 16 ఏళ్ల కింద ఏప్రిల్ 17, 2004న సౌందర్య మరణించారు. పెళ్లై ఏడాది కూడా కాకముందే ఆమె మరణించడం నిజంగానే విషాదం నింపేసింది. 100కు పైగా సినిమాల్లో సౌదర్య చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో నటిచింది. కన్నడ అమ్మాయి అయినప్పటికి తెలుగులో ఎక్కువ సినిమాలు చేసింది. స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ అయింది.

ఈమెకు ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయట. అప్పటి లెక్క ప్రకారమే దాదాపు 100 కోట్ల ఆస్తులు సౌందర్యకు ఉన్నట్లు అప్పట్లో కుటుంబ సభ్యులే చెప్పారు. ఇప్పటికి ఆమె ఆస్తులపై గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తన సోదరుడు అమరనాథ్ సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు సౌందర్య. అయితే ప్రమాదంలో ఇద్దరూ ఒకేసారి మరణించడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. ఇప్పటికీ సౌందర్య ఇంటి నుంచి ఆమె స్థాపించిన కొన్ని విద్యాలయాలకు నిధులు వెళ్తూనే ఉన్నాయి.

సౌందర్య చనిపోయిన కొన్ని నెలలకే కుటుంబంలో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఆమె ఆస్తి కోసం భర్త రఘు కూడా చాలా ప్రయత్నాలు చేసాడు. సౌందర్య వీలునామా రాశారని.. అందులో ఉన్నదాని ప్రకారం తమకు కూడా ఆస్తులు పంచాలని అమర్ నాథ్ భార్య నిర్మల.. ఆమె కుమారుడు సాత్విక్ 2009లో బెంగళూరులోని మెజిస్టేట్ కోర్టును ఆశ్రయించారు. అసలు సౌందర్య వీలునామే రాయలేదని.. నిర్మల సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు వీలునామా సృష్టించారని సౌందర్య తల్లి మంజుల, రఘు కోర్టుకు విన్నవించారు. అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తూనే ఉంది.

తన అత్త మంజుల, వరుసకు సోదరుడు అయిన రఘు తనపై కక్షసాధిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని నిర్మల కోర్టులో కేసు దాఖలు చేసింది. సౌందర్య రాసిన వీలునామా నకిలీ అని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నిర్మల న్యాయవాది ధనరాజ్, సౌందర్య భర్త రఘు, ఆమె తల్లి మంజులపై పరువు నష్టం కేసు వేశారు. ఈ వివాదాలతో ఇంత కాలం వీరు కోర్టు చుట్టు తిరిగారు. 2013 డిసెంబర్ 3వ తేదీన రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. మొత్తానికి సౌందర్య చనిపోయిన తర్వాత కూడా ఆమె ఆస్తుల కోసం చాలా వరకు వివాదాలు జరిగాయి.

మన దర్శకుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

ఇంత మంది హీరోల్లో చరణ్ కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోల కూతుర్లు వీరే..!

టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -