Tuesday, May 7, 2024
- Advertisement -

ఇప్పటికింకా పదహారేళ్లే….

- Advertisement -

వయస్సు  పైబడినా ఆమెలో ఎక్కడా….. వన్నెతగ్గలేదు. అందంతో ఆకట్టుకుని నటనతో సినిమాలు రాబట్టుకుని రెండు జనరేషన్లను ఓ ఊపు ఊపింది.పదహారేళ్ల వయస్సుతో తన సోయగాలు చూపించి….

 

వేటగాడుతో తెలుగు ప్రేక్షకుడి హృదయాన్ని పరేషాన్ చేసింది.అలాంటి ఆ అప్సరస ఇపుడు హాప్ సెంచరీ చేసి నాలుగేళ్లయింది. అయినా… ఆమె నటిస్తే ఇంకా చూడాలనుకుంటున్నారంటే.. ఇక ఆమె గురించి ఏం చెబుతాం చెప్పండి.

 తెలుగు నాట ఓ వెలుగు వెలిగిన అప్సరస .మెడలో రెడ్ కర్చీఫ్ వేసుకుని ఎగిరెగిరి గంతే అక్కినేని తో మొదలు ఎన్టీవోడు,కిట్టిగాడు వరకూ అంతా ఈభామనే కావాలనేవారు.ఈవిడగారు లేందే సినిమా సెట్స్ మీదకు కూడా రాననే వారు.అంతలా ఆకట్టేసుకుంది…. ఈ ఒకప్పటి వయ్యారి నెరజాణ.టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎదిగి ఎంటైర్ ఇండియన్ సినిమానే తన గ్లామర్ తో కట్టిపడేసింది.శ్రీదేవి అందానికి దాసోహ మవ్వని ప్రేక్షకుడంటే లేడు. 

నిజానికి శ్రీదేవికి ముందు నుంచి సౌత్లో మాంచి క్రేజ్ ఉంది. సౌత్లో ఏ టాప్ హీరో శ్రీదేవిని వదులుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు.అది ఆమె మీద ఉన్న గౌరవం అనే కంటే…శ్రీదేవి తమతో చేస్తే వచ్చే ఆ కలెక్షన్స్ లెక్కే వేరనేది పరిశ్రమకు భాగా తెలిసిన మాట. అందుకే బిటౌన్లో కూడా అమితాబ్ నుంచి మిధున్ చక్రవర్తి వరకూ అంతా శ్రీదేవి వెంట పడ్డవారే.మిస్టర్ ఇండియాలో ఆమె నటనను,అందాన్ని  చూసి…. అంతా ఆమెను మిస్ హవా హవాయి అంటూ పిలిచారు.

తొలితరంహీరోలతోనే కాదు సెకండ్ జనరేషన్ హీరోలతో కూడా శ్రీదేవి అలరించింది.చిరంజీవి,వెంకటేష్, నాగార్జునలు బ్యూటీ క్వీన్ తో ఆడిపాడారు.వీరు శ్రీదేవితో చేసిన చిత్రాల్లో హీరోయిజాన్ని డామినేట్ చేసే స్థాయిలో ఈమె గ్లామర్ ఉండేది.కొన్ని సందర్బాల్లో తమ హీరోను శ్రీదేవి డామినేట్ చేసేస్తుందని గోల చేసిన హీరోల అభిమానులు ఉన్నారు.కేవలం అందం పరంగానే కాకుండా పర్ ఫార్మెన్స్ విషయంలోను శ్రీదేవి టాప్ స్టేజ్ లో కొనసాగింది.క్షణక్షణం చిత్రమే దానికి మాంచి ఉదాహరణ.

శ్రీదేవికి లెక్కలేనన్ని ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి.అయినా ఏనాడు శ్రీదేవి పొంగిపోలేదు.జయప్రదతో ప్రొఫెషనల్ ఫైట్ ఉన్నప్పటికీ…తన ర్యాంక్ ను ఎప్పుడూ తగ్గించుకోలేదు. 

కృష్ణ,శోభన్ బాబు,కృష్ణం రాజు లాంటి వారు శ్రీదేవితో చేసిన ప్రతి చిత్రంతోను బ్లాక్ బస్టర్లు కొట్టారు.నాగార్జున అయితే ఏకంగా సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె అందాన్ని ఆకాశానికి ఎత్తేశాడు.

 50లలో కూడా శ్రీదేవి ఇంతటి గ్లామర్ తో కనిపించడానికి ప్రధాన కారణం…. ఆమె ఫిట్ నెస్ మంత్రం యోగానే.అదే ఆమెను ఎప్పటికీ గ్లామర్ చెరగని భామలా తీర్చిదిద్దుతుంది. స్టిల్ 54లోకి వచ్చినప్పటికీ… శ్రీదేవి మునుపటి ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -