Tuesday, May 14, 2024
- Advertisement -

పవన్ వినిపించిన సర్దార్ గబ్బర్‌సింగ్ సెన్సార్ సర్టిఫికెట్ ఆవేధనా గాథ….. అసలు నిజాలు ఇవిగో

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు రోజుల పొలిటికల్ కార్యక్రమం ముగిసిపోయింది. సాధారణంగా అయితే పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వచ్చిన ప్రతి సందర్భంలోనూ పవన్ అభిమానులందరూ కూడా సోషల్ మీడియాలో దుమ్ముదులిపే స్థాయి ప్రచారం చేస్తారు. అయితే ఈ సారి మాత్రం మూఢాభిమానులకు కూడా అలాంటి అవకాశం ఇవ్వకుండా తాను కేవలం బాబు భజన బృందంలో సభ్యుడినే తప్ప ప్రజా నాయకుడిని కాదని నిరూపించుకున్నాడు పవన్. ప్రతి సభలోనూ ప్రతిపక్ష నాయకుడైన జగన్ ఏం చేస్తున్నాడు? ఎందుకు ప్రజా సమస్యలు పరిష్కరించలేకపోతున్నాడు అని రాజకీయ ఓనమాలు తెలియనివాడిలా ప్రశ్నించిన పవన్…….ఆయా సమస్యలన్నీ కూడా చంద్రబాబుకు తెలిసి ఉండకపోవచ్చు. తెలిసి ఇలా చేస్తాడా అంటూ హాశ్ఛర్యం వ్యక్తం చేస్తూ బాబుని సమర్థిస్తూ పోయాడు. అందుకే రాజకీయంగా పవన్ అజ్ఙానం బయటపడడంతో పాటు పవన్ కళ్యాణ్ బాబు భజన కోసమే రాజకీయం చేస్తున్నాడని కూడా అందరికీ అర్థమైపోయింది. రాజకీయ విషయాలు పక్కనపెడితే సర్దార్ గబ్బర్‌సింగ్ సెన్సార్ సర్టిఫికెట్‌కి ఇబ్బందులు అంటూ ఒక సినిమా ఆవేధనా వీరగాథ వినిపించాడు పవన్.

అసలు కథేంటా అని ఒక సెన్సార్ సభ్యుడిని అడిగితే ఆయన ఆశ్ఛర్యపోయే ప్రశ్న అడిగాడు. ‘అసలు సర్దార్ గబ్బర్‌సింగ్‌లో అభ్యంతరకర విషయం ఏముందని సెన్సార్ ఇబ్బందులు వస్తాయి. ఫక్తు రొటీన్ కమర్షియల్ సినిమాలకు సెన్సార్ ఇబ్బందులు వచ్చినట్టుగా ఎప్పుడైనా ఎక్కడైనా చదివారా? పరమ రొటీన్ కమర్షియల్ సినిమాలకు సెన్సార్ ఇబ్బందులు ఎందుకు వస్తాయి? ఆయనేదో అభిమానుల్లో సెంటిమెంట్ రాజేయడానికి అబద్ధాలు చెప్పుకుంటే అది పట్టుకొచ్చి మమ్మల్ని వివరాలు అడగాలా? కామన్ సెన్స్‌తో ఆలోచిస్తే ఎవరికైనా అర్థమయ్యే విషయమేగా అది’ అని అంటూ అసలు విషయం చెప్పాడు ఆ సెన్సార్ సభ్యుడు. ఇంకా కూడా ఏదో అడగబోతే ‘సర్దార్ గబ్బర్‌సింగ్‌లో ఏదైనా కొత్త సీన్ ఉందా? ఎట్‌లీస్ట్ అశ్లీలత అయినా ఎక్కువ స్థాయిలో ఉందా? రక్తపాతం ఉందా? లేకపోతే సమాజంలో చర్చనీయాంశమయ్యే ఏదైనా విషయం ఉందా? అసలు ఏం ఉంది? గబ్బర్‌సింగ్ సినిమాకు సెన్సార్ ఇష్యూ రానప్పుడు సర్దార్ గబ్బర్‌సింగ్‌కి మాత్రం ఎందుకొస్తుంది? ’ అంటూ మళ్ళీ ఆయనే ఎదురు ప్రశ్నలు అడిగారు.

మీకు కూడా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలా? తెలుగు సినిమాలు రెగ్యులర్‌గా చూసేవాళ్ళకు అందరికీ తెలిసిన విషయమేగా. ఆ సెన్సార్ సభ్యుడి ప్రశ్నలకు మీ మనస్సాక్షి, ఆలోచనా పరిధి చెప్తున్న సమాధానాలు ఏంటో మీరూ తెలుసుకోండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌గారు సినిమాల్లో కంటే గొప్పగా నటిస్తూ బేలగా బాధను వ్యక్తం చేస్తూ ఆవేధనా పూరితంగా వినిపించిన సర్దార్ గబ్బర్‌సింగ్ సెన్సార్ విషాద గాథ వెనకాల అసలు నిజాలు మీకే తెలుస్తాయి. కాకపోతే అభిమాన మూఢత్వం ఆలోచనా పొరలను కమ్మేసి ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్‌ని ఓదార్చడానికి, సర్దార్‌తో డబ్బులు పోయాయి అని ఆ మధ్య మరో సభలో కూడా పవన్ చెప్పి ఉన్న నేపథ్యంలో అజ్ఙాతవాసి సినిమాకు కూడా పాతిక కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న పవన్‌కి మీ దగ్గరున్న పదో పరకో ఇచ్చి ఆయనను ఆదుకోవడానికి బయల్దేరండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -