దేశంలో అక్కడక్కడా వింతలు చోటు చేసుకుంటుంటాయి. వేపచెట్టుకు పాలు కారడం లాంటి సంఘటనలు దేశంలో చాలనే జరిగాయి. చెట్టునుంచి నీల్లు బయటకు రావడం ఇప్పటి వరకు భైరవద్వీపం సినిమాలో చూశాం. కాని ఇప్పుడు మాత్రం నిజంగానే ఒ చెట్టునుంచి వింతజలం బయటకు ఉబికివస్తోంది. చెట్టునుంచి నీళ్లు కారడం ఏంటి అనుకుంటున్నారా..? మీరు విన్నది నిజమే.
వివరాల్లోకి వెల్తే అసోంలోని కామరూప్ జిల్లాలో ఈ వింత చోటుచేసుకుంది. బైహాటా ప్రాంతంలో ఉన్న ఈ చెట్టు నుంచి వింత జలం బయటకు ఉబికివస్తోంది. చెట్టు నుంచి వింత జలం వస్తుందన్న వార్త.. వైరల్‌గా మారడంతో…. దూరప్రాంతాలవారు కూడా ఇక్కడికి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
ఇంకేముంది చెట్టుకు దండాలు పెడుతూ పూజలు చేస్తున్నారు అక్కడి ప్రజలు. అయితే దీనిని అద్భుతంగా భావిస్తూ, జనం ఈ నీటిని బాటళ్లలో నింపుకొని తీసుకెళ్తున్నారు. దీనికి గల కారణాలు తెలియరాలేదు.
