Thursday, May 16, 2024
- Advertisement -

కౌంటీల్లో కోహ్లీ ఆడ‌ట‌మా….? నాన్సెన్స్‌

- Advertisement -

త్వ‌ర‌లో ఇంగ్లాండు ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో విరాట్ కోహ్లీ అక్క‌డి కౌంటీ మ్యాచ్‌లో ఆడాల‌ని నిర్ణ‌తీసుకున్న సంగ‌తి తెలిసిందే. సిరీస్ ఆరంభానికి ముందు  అక్క‌డి పిచ్‌ల‌ను అర్థం చేసుకొనేందుకు కోహ్లీకి కౌంటీల్ మ్యాచ్‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

అయితే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇంగ్లీష్‌ కౌంటీల్లో ఆడే అవకాశం కల్పించడాన్ని ఇంగ్లండ్‌ మాజీ బౌలర్‌ బాబ్‌ విల్లీస్‌ తప్పుబట్టారు. కోహ్లి కౌంటీలు ఆడటమేంటి నాన్సెన్స్‌ అంటూ మండిపడ్డారు. ఇలా విదేశీ ఆటగాళ్లు కౌంటీలు ఆడితే స్థానిక ఆటగాళ్లు నష్టపోతారని ఇది ఇంగ్లండ్‌ క్రికెట్‌కు అంత మంచిది కాదని ఈ లెజండరీ క్రికెటర్‌ అభిప్రాయపడ్డారు.

భారత జట్టు ఇంగ్లాండ్ గడ్డపై జులై 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు చివర్లో ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. ఆ గడ్డపై గతంలో పర్యటించిన కోహ్లి ఐదు టెస్టుల్లో కలిపి చేసిన పరుగులు 134 మాత్రమే. దీంతో.. ఈ ఏడాది పర్యటనలో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇందులో భాగంగా సిరీస్‌ ఆరంభానికి ముందే అక్కడికి వెళ్లి కౌంటీలు ఆడాలని కోహ్లి ఇటీవల నిర్ణయించుకున్న విషయం తెలిసిందే

కౌంటీల్లో ఆడి అనుభవం పొందిన కోహ్లిని ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌లో ఆపటం ఇంగ్లీష్‌ బౌలర్లుకు కష్టతరమని ఈ మాజీ క్రికెటర్‌ చెప్పుకొచ్చారు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్తుత్తమ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన కోహ్లి జరగబోయే ఇంగ్లండ్‌ సిరీస్‌లో రాణిస్తే జోరూట్‌, స్టీవ్‌ స్మిత్‌, కేన్స్‌ విలియమ్సన్‌లను మించిపోతాడని వ్యాఖ్యానించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -