Tuesday, May 14, 2024
- Advertisement -

ఫిదా లో సాయి పల్లవికి అత్తగా నటించింది ఎవరో తెలుసా..?

- Advertisement -

ఫిదా.. అసలు ఏముందిరా బై సిన్మా… శేఖర్‌ కమ్ముల.. అమెరికాల, ఆంధ్రాల, తెలంగాణల తెలుగు సిన్మావాళ్లను ఫిదా చేసిండు.. గదిఏందో ఇప్పుడు జెప్తా చూడండి.. ఇప్పటి వరకు తెలంగాణ యాస ఎక్కువ గా సినిమాల్లో.. కమెడీయన్ పాత్రకో.. విలన్ పాత్రకో వాడేవారు.

కానీ ఫిదా మూవీలో మాత్రం హీరోయిన్ సాయి పల్లవి పాత్ర తెలంగాణలో ఉండటం ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. సింపుల్ గా చెప్పాలంటే.. అమెరికా నుంచి తన అన్న పెళ్లి చేయడానికి వచ్చిన కుర్రాడు.. పెళ్లి కుతురు చెల్లి ఇష్టపడుతాడు. ఆ తర్వాత ఆమెను ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది కథ. కథ చాలా సింపుల్ గా ఉంటుంది కానీ అందులో ఉండే ఎమోషన్స్.. లవ్.. ను అద్భుతంగా చూపించాడు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం ఈ సినిమా రికార్డులను సృష్టిస్తోంది.

“బద్మాష్…బొక్కలు ఇరగ్గొడతా..నాకరల్..!
భానుమతి…హైబ్రిడ్ పిల్ల…
ఈ రోడ్లు మాయి…గాప్చుప్ కూర్చో
ఏమున్నాడే..కరెంటు..షాక్ కొడ్తది
ఓ బాయిలర్ కోడా?
బారాబర్ ఎస్కుంటా..! నీకేమైనా ప్రాబ్లెమ్ ఉంటె కళ్ళు మూసుకో!
పైసల్ లేవు! జ్ఞ్యానం ఇస్తునవ్ కదా! పూకాట మే ఏం వద్దు”
సాయి పల్లవి చెప్పిన ఈ డైలాగ్స్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

ఇక ఈ సినిమాలో సాయి పల్లవికి అత్తగా నటించిన ఆమె ఎవరో కాదు.. పెళ్లి చూపులు సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ వాళ్ల అమ్మ గారు. ఏది ఏమైన కొత్త ధనంతో అందరిని కొత్తగా ఈ సినిమా ఫిదా చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -