Monday, May 20, 2024
- Advertisement -

టీడీపీ ఓటమికి అఖిల ప్రియనే కారణమా..?

- Advertisement -

టీడీపీ పార్టీలో అఖిల ప్రియ పై విమర్శలు ఆ పార్టీ నాయకులే చేస్తున్నారు. టీడీపీ పార్టీ నేతలకు.. అఖిల ప్రియకు అసలు పడటం లేదు. మొదటి నుంచి మంత్రి భూమా అఖిలప్రియకు, సీనియర్ మంత్రి, ఉపముఖ్యమంత్రైన కెఇ కృష్ణమూర్తికి పడదు. అలానే జిల్లాల్లోని పలువురి ఎమ్మెల్యేలతో కూడా అఖిల ప్రియకు పడకపోవడంతో దూరంగా ఉంటుంది. అంతేకాకుండా ఎన్నికల్లో కీలకనేత అయిన ఏవి సుబ్బారెడ్డితో ఆమెకి విబేధాలు మరి ఎక్కువ అయ్యాయట.

అయితే అఖిల ప్రియను నంద్యాల ఎన్నికల్లో కేవలం ప్రచారంకే పరిమితం చేశారు చంద్రబాబు. అయితే అఖిల అనుభవరాహిత్యం.. ఆమెకి నంద్యాలలో పెద్దగా పట్టులేకపోవటం లాంటి అనేక అంశాలు ఏవికి బాగా కలిసి వచ్చాయి. దాంతో వచ్చిన అవకాశాలను ఏవి బాగా ఉపయోగించుకుంటున్నారు. అయితే ప్రచారంకు వస్తున్న ఎవరైన సరే ఏవి చెప్పినట్లే వినాల్సిందే. అయితే జరుగుతున్న పరిణామలను బట్టి కూడా చంద్రబాబు ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఏవికి అప్పచెప్పిరట. అయితే ఇలా చంద్రబాబు ఏవిని ఎంతకాలం వాడుకుంటారో తెలియదు కానీ.. ఈ విషయంలో ఏవికి జగ్రత్తగా ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న పద్దతిలో వ్యవహరిస్తున్నారు. మంత్రి అయిన దగ్గర నుండి అఖిల వ్యవహారశైలి కూడా అదే విధంగా ఉంది.

ఎవ్వరితో సరిగ్గా ఉండకపోవడం.. ఎవరిని కలుపుకుని వెళ్ళటం లేదు. ఇక నేతలు చేస్తున్న ప్రచారం కూడా అంతంత మాత్రమే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గెలుపుకు కోసం ఎవరు కూడా మనస్పూర్తిగా పనిచేయటం చేయుడం లేదని ప్రచారం జరుగుతోంది. దాంతో టీడీపీకి భయం పట్టుకుంది. నోటిఫికేషన్ రాకుండానే ఇన్ని జరిగితే.. నోటిఫికేషన్ వచ్చాక మరి ఎన్ని సమస్యలు ముందు పడుతాయో మరి. అయితే చంద్రబాబు ఈ విషయంలో ఎలాంటి జగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -