నేడు చోటుచేసుకున్న సమాజ మార్పుల నేపథ్యంలో వచ్చిన జీవన శైలోలని ఆహారపు అలవాట్ల కారరణంగా అనేక మంది అధిక బరులు సమస్యను ఎదుర్కొంటున్నారు. అధిక బరువు అనేక అనారోగ్య సమస్యలను కూడా తెచ్చిపెడుతోంది. మీరు కూడా అధిక బరువుతో బాధపడుతున్నారా? మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ డైట్‌ను ఫాలో అయితే ఈ సమస్య నుంచి త్వరగానే ఉపశమనం పొందుతారు.
ఆ వివరాలు మీకోసం.. మనుషులు అధికంగా బరువు పెరగడానికి కారణాలు అనేకం ఉన్నాయని వైద్య నిపులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కొవ్వు పదార్థాలు తీసుకోవడం.. దానికి అనుగుణంగా వ్యాయామం (శ్రమ) చేయకపోవడం, ఎక్కువ సమయం కూర్చునే పనిలో ఉండటం అధిక బరువుకు కారణం అవుతుంది. అయితే, మన నిత్యజీవితంలో గుడ్లను ఆహారంగా తీసుకోవడంతో అధిక బరువుకు చెక్ పెట్టడంతో పాటు మంచి పోషకాలు కూడా శరీరానికి లభిస్తాయి.
ఎందుకంటే గుడ్లలో శరీరానికి అవసరమైన 9 రకాలైన ఎమైనో ఆమ్లాలు, మిటమిన్లు ఉంటాయి. ఇవి శరీర బరువును తగ్గించడానికి దోహదం చేస్తాయి. ఈ ఎగ్‌డైట్ ప్లాన్‌లో అధికంగా నీరు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, సున్నా క్యాలరీలు గల పానీయాలను కూడా తీసుకోవచ్చు. అయితే, పిండి పదర్థాలు సహజ చక్కెరలతో కూడా ఆహారం అధికంగా తీసుకోవడం ఈ డైట్‌లో చేయకూడదు. ఈ డైన్‌ను 14 నుంచి 21
రోజుల వరకు పాటించాల్సి ఉంటుంది. అయితే, వారి వారి బరువుకు తగ్గట్టుగా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది కాబట్టి మొదట వైద్య నిపుణుల సంప్రదించి డైట్ ఫాలో కావడం ఉత్తమమని నిపుణులు పేర్కొంటున్నారు.
‘ప్రేమికుల రోజు’న ప్రభాస్ స్పెషల్ గిఫ్ట్..!
సరిగా నిద్రపోవడం లేదా..? అయితే మీకు.. !
డబ్బే మనది కుమ్మేస్కో అంటున్న కాజల్.. మంచు విష్ణు !