Sunday, April 28, 2024
- Advertisement -

ఆరోగ్యకరమైన జీవితం కోసం చిట్కాలు…

- Advertisement -

వాతావరణంలో వస్తున్న మార్పులు, పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా మానవ జీవన విధానంలో ఎన్నో మార్పులు సంభవించాయి. ప్రధానంగా ఆహారపు అలవాట్లలో మార్పులు రావడంతో చిన్న చిన్న రోగాలకే లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే రోజువారి జీవన విధానంలో చిన్నచిన్నమార్పులతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చు.

ఆరోగ్యకరమైన ఆహారంలో సరైన మొత్తంలో కేలరీలను తినడం ప్రధానం. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ తింటే అది కొవ్వుగా నిల్వ చేయబడుతుంది. తద్వారా బరువు పెరుగుతారు. పురుషులు అయితే రోజుకు 2,500 కేలరీలు, మహిళలు అయితే రోజుకు 2,000 కేలరీలు రోజుకు అవసరం అవుతాయి. ఇంతకుమించిన కేలరీలు అన్ని కొవ్వుగా మారి బరువు పెరిగేందుకు దోహదం చేస్తాయి.

మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు మూడింట ఒక వంతు మాత్రమే ఉండాలి. ప్రతిరోజూ ఆహారంలో పండ్లు మరియు కూరగాయలు ఉండేలా జాగ్రత్త పడాలి. చేపల్లో ప్రోటిన్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే ఒమేగా – 3 గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి.

మానవ శరీరానికి కొవ్వు అసవరం కానీ ఎక్కువైతే రక్తంలో చేరి గుండె జబ్బులకు కారణం అవుతుంది. కాబట్టి కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను వీలైనంత తక్కువ చేస్తే మంచింది. అలాగే షుగర్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకోకుడదు. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి గుండె జబ్బులు లేదా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది.

తీసుకునే ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య బారిన పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఎందుకంటే అధిక బరువు ఉండటం వలన టైప్ 2 మధుమేహం, కొన్ని క్యాన్సర్లు, గుండె జబ్బులు మరియు హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతీ రోజు కనీసం 3 నుండి 4 లీటర్ల నీటిని తాగడం కంపల్సరీ. ఇక బ్రేక్ ఫాస్ట్‌ను అస్సలు స్కిప్ చేయవద్దు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -