Wednesday, May 22, 2024
- Advertisement -

ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైనా నేయిల్‌పాలిష్ ధ‌ర అక్ష‌రాల రూ.1,63,66,000

- Advertisement -

నెయిల్ పాలిష్.. ఇష్టపడని అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారు. చాలా మంది అమ్మాయిలు రోజుకో రంగు నెయిల్ పాలిష్ వేసుకొని మురిసిపోతుంటారు. మార్కెట్‌లోకి రోజుకో నెయిల్ పాలిష్ లు వ‌స్తున్నాయి.విపరీతంగా ఇష్టపడి ఎంత‌ఖ‌రీదైనా పెట్టి కొనేవారున్నారు. అలాంటి వారి కోస‌మే ఈ ఖ‌రీదైన నేయిల్ పాలిస్‌.

సాధారణంగా నెయిల్ పాలిష్ ఖరీదు ఎంత ఉండి ఉంటుంది..? రూ.20,రూ.30.. ఉంటుంది. అదే బ్రాండెడ్ అయితే.. రూ.200, రూ.300 ఉంటాయి. మహా అంటే.. రూ.1000 ఉంటుందేమో అంతే కదా. కానీ.. ఈ ఫోటోలో కనిపిస్తున్న నెయిల్ పాలిష్ మాత్రం అలాంటిది.. ఇలాంటిది కాదండోయ్‌.

ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన గోళ్ల రంగును లాస్ ఏంజెలీస్‌కి చెందిన అజాట్యూర్ అనే సంస్థ త‌యారుచేసింది. దీని ధ‌ర అక్ష‌రాల 250,000 డాల‌ర్లు.. అంటే రూ. 1,63,66,00. 267 కేర‌ట్ల న‌లుపు రంగు వ‌జ్రాల‌ను మేళ‌వించి ఈ నెయిల్ పాలిష్‌ని త‌యారుచేశారు. కేవ‌లం ఒకే ఒక్క బాటిల్‌ను త‌యారు చేసిన‌ట్లు సంస్థ ప్ర‌క‌టించింది. ఆ ఒక్క బాటిల్‌ను త్వ‌ర‌లో ఆన్‌లైన్‌లో అమ్మ‌కానికి పెట్టారు. ఈ ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొనుగోలు చేయడానికి చూస్తుంటే.. అప్పుడే అవుట్‌ ఆఫ్‌ స్టాక్‌ అని చూపిస్తుందట. ఇంత ఖరీదైన నెయిల్ పాలిష్ కొనాలంటే.. వారి దగ్గర ఎన్ని కోట్ల ఆస్తులు ఉండాలో మ‌రి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -