వాళ్లిదరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. రానురాను ఒకరిమీద ఒకరికి ప్రేమ పెరిగిపోయింది. ప్రేమించుకున్నారు. చివరకు పెళ్లికూడా చేసుకున్నారు. మంచిదే కాదా.. అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ పెళ్లి చేసుకుంది.. అమ్మాయి, అబ్బాయి కాదు. ఇద్దరు అమ్మాయిలే. పైగా వారిద్దరికి 18 ఏండ్లు కూడా నిండలేదు. దీంతో ఇరు కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. ఇప్పుడు ఈ అమ్మాయి లవ్ స్టోరీ పోలీసు స్టేషన్ కు చేరింది.
వివరాల్లోకి పోతే.. జార్ఖండ్‌లోని సుగాయ్‌దిహ్ గ్రామానికి చెందిన ఇద్దరు అమ్మాయిలే చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. రానురాను వీరి స్నేహం కాస్తా.. ప్రేమగా మారిపోయింది. ఒకరంటే ఒకరికి ఇష్టం పెరిగిపోయింది.పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఇరు కుటుంబ సభ్యులకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇవి విన్ని వారి కుటుంబ సభ్యులు షాక్ కావడంతో పాటు దాన్ని తిరస్కరించారు.అలాగే నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు.
దాంతో ఒక అమ్మాయి అబ్బాయిగా వేషం మార్చింది. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. స్నేహితుల హెల్ప్ అడిగారు. వారు ఎవరూ సహకరించకపోవడంతో ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. కానీ తాళి కట్టించుకున్న అమ్మాయి మెడలో సోమవారం మంగళసూత్రాన్ని వారి కుటుంబ సభ్యులు చూసి ఆశ్చర్యపోయి ప్రశ్నించారు. దీంతో విషయం తెలుసుకుని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారు వినలేదు. 18 ఏళ్లు నిండిన తర్వాత మీ ఇష్టప్రకారం చేయొచ్చుకానీ ఇప్పుడైతే.. మీ ఇళ్లకు వెళ్లమని పోలీసులు సూచించారు. అయితే ఇక్కడ ఒక ట్వీస్ట్ ఉంది. వారి మనసుల మాదిరిగానే వారిద్దరి పేర్లు కూడా ఒకటే. వారి ఇద్దరి పేర్లు కూడా పూజనే.
ప్రియాంకపై కన్నేసిన సలార్ డైరెక్టర్!
నేనెంటో చూపిస్తానంటున్న బాలయ్య