ప్రియాంక‌పై క‌న్నేసిన స‌లార్ డైరెక్ట‌ర్!

- Advertisement -

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, కేజీఎఫ్ సూప‌ర్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ క‌లిసి తీయ‌బోతున్న సినిమా స‌లార్. ఈ సినిమాపై రోజురోజుకు అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. గోదావరిఖని సింగరేణి బొగ్గు గనుల్లో ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. అక్కడ ప్రభాస్‌‌ ఏంట్రీ సీన్ల‌ను తీస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే నిన్న మొన్నే ఈ సినిమాలో న‌టించే విల‌న్ ఎవ‌ర‌నేది తెలిసింది.

ఇప్పుడు మ‌రో షాకింగ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉండ‌నుందంట‌. ఈ పాట కోసం గ్లోబల్‌ స్టార్‌, బాలీవుడ్ న‌టి అయిన‌ ప్రియాంక చోప్రాను దర్శకుడు సంప్రదించినట్లు స‌మాచారం. ఇప్ప‌టి వ‌రకు దీనిపై ప్రియాంక చోప్రా స్పందించ‌లేద‌ని తెలుస్తోంది. డైర‌క్ట‌ర్ ఆమె గ్రీన్ సిగ్న‌ల్ కోసం వేచి చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇది కానీ ఒకే అయితే.. సినిమా ఇంకో రేంజ్ లో ఉండ‌బోతుంద‌ని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు తెలుపుతున్నారు. ప్రియాంక ఇప్ప‌టికే ప‌లు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన సంగ‌తి తెలిసిందే. సలార్‌ స్పెషల్‌ సాంగ్ లో న‌టించేందుకు ప్రియాంక ఒప్పుకుంటే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్‌ ఇచ్చేందుకు కూడా సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

నేనెంటో చూపిస్తానంటున్న బాలయ్య

టాప్ హీరోయిన్ల‌ను సైతం వెన‌క్కి నెట్టేసిన స‌మంత‌!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -