స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతీ మొబైల్‌లో ను యాప్‌లు దర్శన మిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 500 మిలియన్లుకు పైగా మొబైల్ ఇంటర్నెట్ సర్ఫింగ్ అప్లికేషన్ యూసీ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నారు. అయితె దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి నెలరోజులపాటు తొలగించింది ఆండ్రాయిడ్. దీంతో ప్లేస్టోర్‌లో ఇది కనిపించడంలేదు.
ఎవరైనా ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ప్రతయత్నిస్తే యూసీ బ్రౌజర్` అని సెర్చ్ చేస్తే కేవలం యూసీ మినీ యాప్ మాత్రమే కనిపిస్తుంది. దీనికి గల కారణాలను ఆండ్రాయిడ్ సెంట్రల్ అనే టెక్నికల్ మేగజైన్ వెల్లడించింది. ఇన్‌స్టాల్స్ సంఖ్యను పెంచడం కోసం తప్పుదారులు ఎంచుకుని, ఇష్టం వచ్చినట్లు అడ్వర్‌టైజ్‌మెంట్లను యూసీ బ్రౌజర్ ఇస్తుందని, ఇది ఆండ్రాయిడ్ పాలసీలకు విరుద్ధం కావడంతో తాత్కాలికంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి యూసీ బ్రౌజర్ యాప్‌ను ఆండ్రాయిడ్ తొలగించిందని మేగజైన్లో ఉంది.
దీనిపై యూసీ బ్రౌజర్ ఉద్యోగి ఒకరు తన ట్విట్టర్ ఖాతాలో స్పందించాడు. యూసీ బ్రౌజర్‌ను ప్లేస్టోర్ నుంచి 30 రోజుల పాటు తొలగిస్తున్నట్లు తనకు ఈ మెయిల్ వచ్చినట్లు ఆ ఉద్యోగి స్పష్టం చేశాడు.