Saturday, April 27, 2024
- Advertisement -

అలర్ట్ : ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి ..!

- Advertisement -

ఈ ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్స్ ప్రతిఒక్కరి చేతికి వచ్చిన తరువాత.. లాభాలు ఏ స్థాయిలో ఉన్నాయో నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా లాభాల విషయాన్ని పక్కన పెట్టి నష్టాల గురించి ఆలోచిస్తే.. పోన్ లో ఉపయోగించే కొన్ని రకాల యాప్స్ వల్ల వ్యక్తిగత సమాచారం హ్యాకర్స్ చేతిలోకెళ్లి చిక్కుల్లో పడుతున్నారు చాలమంది. హ్యాకర్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త రకాల మాల్వేర్స్ ను సృష్టిస్తూ యాప్స్ ద్వారా యూజర్స్ సమాచారాన్ని దొంగిలిస్తూ ఉంటారు. అయితే ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే యాప్స్ ద్వారా మల్వర్ అటాక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గూగుల్ సంస్థ ప్రైవసీ, సెక్యూరిటీ పరంగా చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది.

అయితే కొన్ని సార్లు గూగుల్ ప్రైవసీని కూడా కళ్ళు గప్పి ప్లేస్టోర్ లో ఉన్న యాప్స్ లో మాల్వేర్స్ ను ఇన్ క్లూడ్ చేస్తూ ఉంటారు హ్యాకర్స్.. అలా మాల్వేర్స్ అటాక్ ఉన్న యాప్స్ ను గూగుల్ సంస్థ కనుకొని అప్పుడప్పుడు అలాంటి యాప్స్ ను ప్లేస్టోర్ నుంచి తొలగిస్తోంది. ఇక తాజాగా మరో ఎనిమిది యాప్స్ లో మల్వర్ అటాక్ కారణంగా ప్లేస్టోర్ నుంచి రిమూవ్ చేసింది గూగుల్ సంస్థ. ఆ యాప్స్ ఏవనగా.. vlog star video editor, creative 3d launcher, wow beauty camera, gif emoji keybord, freeglow camera, coco camera, funny camera by kelly tech, rajer keybord, వంటి యాప్స్ ను గూగుల్ తొలగించింది.

ఈ యాప్స్ లో ఉన్న మాల్వేర్ చాలా ప్రమాదకరమైనదని, ఈ యాప్స్ చేసుకున్నా వెంటనే మొబైల్ లోని వ్యక్తిగత సమాచారంతో పాటు, బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులను కూడా లూటీ చేస్తుందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ 8 యాప్స్ ను 30 లక్షల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకునత్త్లు సమాచారం. దాంతో ఆ యాప్స్ మొబైల్ లో ఉన్నవారు వెంటనే డిలీట్ చేయాలని, లేకుంటే ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గూగుల్ మ్యాప్స్ లో క్రేజీ ఫీచర్ ..సూపర్ !

గూగుల్ క్రోమ్ వాడుతున్నారా .. జాగ్రత్త !

టాప్ లో భారత్.. ప్రమాదం తప్పదా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -