Sunday, June 16, 2024
- Advertisement -

లలిత జ్యూయలర్స్ కిరణ్ వాడే వాచీ విలువెంతంటే..?

- Advertisement -

ప్రతి ఇంట్లో.. టీవీ పెట్టాగానే.. వినిపించే మాట ఇంతకాలం మీరు నష్టపోయింది చాలు.. డబ్బులు ఊరికే రావు అనే మాటలు వినిపిస్తాయి. ఈ యాడ్ రాగానే అందరి దృష్టి అతనిపైనే. ఆయన పెద్ద సెలబ్రిటీ కాదు.. స్టార్ హీరో కాకపోయిన.. ఆయనకు ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. ఆయన ఎవరో కాదు లలితా జ్యుయలర్స్ చైర్మన్ కిరణ్ కుమార్. నున్నటి గుండుతో ఇతను చెప్పే మాటలు బంగారం లెక్క ఉంటాయి.

తన మాటలే పెట్టుబడిగా.. తనే ఓ బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు . టీవీల్లో తన బంగారం మంచిదని ప్రచారం చేసుకుంటే ఎదుటి వాళ్ల బంగారం భాగోతం గురించి పదే పదే చెబుతుండే సరికి అందరి దృష్టినీ ఆకట్టుకోగలిగాడు. తన ప్రచారం స్టైలే మరింత బిజినెస్ తెచ్చిపెట్టింది. దీంతో ఇంకా ఎక్కువ యాడ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఇక ఆయన పర్సనల్ విషయాలకు వస్తే.. ఆయనకి వాచీలు అంటే చాలా చాలా ఇష్టం. ఎప్పుడూ కొత్త వాచీలు కొంటూనే ఉంటారు. కిరణ్ చేతికి పెట్టుకునే వాచీ విలువ ఎంతో తెలుసా అక్షరాల కోటి రూపాయలు. కోటి విలువ చేసే వాచీలు ఆయన దగ్గర మూడు ఉన్నాయట. ఏ కొత్త వాచీ మార్కెట్ లోకి వచ్చినా కొనాల్సిందేనట.

ఇప్పటికే అత్యంత ఖరీదైన వాచీలు 42 ఉన్నాయని చెప్పారు. అలానే వాచీలే కాదు షూస్ కూడా చాలా ఇష్టం. దేశ, విదేశాల నుంచి కూడా కొత్తగా వచ్చిన చెప్పులు, షూస్ తన ఇంటికి రావాల్సిందే. ఇప్పటికే 100 జతల షూస్ ఉన్నాయట. ఇటీవలే విదేశాల నుంచి లక్షన్నర రూపాయల విలువ చేసే రన్నింగ్ షూ తెప్పించుకున్నారట. వీటితోపాటు సినిమాలు అంటే పిచ్చి. రజనీకాంత్ అంటే పడిచచ్చే అభిమానం. రజనీకాంత్ సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షోని ఫ్యాన్స్ మధ్య ఉండి చూడటం అంటే చాలా ఇష్టమట. లింగా సినిమాలో ఓ సీన్ ను చెన్నైలోని లలితా జ్యుయలర్స్ లోనే తీశారు. అందులో ఓ చిన్న డైలాగ్ ను రజినీకి చెప్తాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -