Thursday, May 2, 2024
- Advertisement -

చిరు భార్య సురేఖ గురించి మీకు తెలియని విషయాలు

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవీ సతీమణి సురేఖ అని అందరికి తెలిసిన విషయమే. అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను చిరంజీవి వివాహాం చేసుకున్న తర్వాత చిరంజీవి కాస్తా మెగాస్టార్ అయ్యారు. సురేఖ.. చిరు లైఫ్ లోకి వచ్చాక ఆయన దశ తిరిగింది. ఆమె వల్లే తనకు అదృష్టం కలిసి వచ్చిందని చిరు.. తన సన్నిహితుల వద్ద చెబుతుంటారు.

తన జీవితంలో తనకు దేవుడు ఇచ్చిన రెండు వరాలు ఇచ్చాడని అని ఒకటి సినీ ఇండస్ట్రీలో హీరో కెరీర్, రెండు తనకు సురేఖ భార్య కావడం అని మెగాస్టార్ భావిస్తుంటారు. అయితే చిరు.. సురేఖ గురించి ఇంతలా పొంగిపోవడానికి.. అనేక కారణాలు ఉన్నాయి. అల్లు రామలింగయ్య కూతురైన సురేఖ చిరంజీవి భార్య కావడం వలన కొణెదల వారి ఇంటి కోడలుగా మారింది. ఫ్యామిలీకి పెద్ద కోడలిగా తనపై ఎన్నో బాధ్యతలు ఉన్నాయని భావించిన సురేఖ అందరిని కలుపుకుని పోవడంతో చిరంజీవి సినిమాలపై దృష్టి పెట్టడానికి ఎక్కువగా వీలు కలిగింది. ఓ వైపు తన పిల్లలు, మరోవైపు తన ఆడపడుచులు, మరుదల బాగోగులు చూసుకునే తీరు ఎంతో గొప్పగా ఉంటుందని ఆమె గురించి తెలిసిన వాళ్ళు చెప్తూఉంటారు. మరి ముఖ్యంగా చిరంజీవి పెళ్లినాటికి పవన్ కళ్యాణ్ చాలా చిన్నవాడని.. కాబట్టి ఆమె పవన్ కళ్యాణ్ ని కూడా తన కొడుకులనే చూసుకుందని.. పవన్ కూడా అనేకసార్లు చెప్పారు. అందుకే ఆయన ఇప్పటికి తనని అన్నవదినాలే దేవుళ్ళు అని పదే పదే గుర్తుచేసుకుంటూ ఉంటారు.

మొన్న ఈ మధ్య ఓ పెళ్లివేడుకలో తన వదినని కలసిన పవన్ కళ్యాణ్ ఆమెతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడడం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. పవన్ కు వదిన అంటే.. ఇంత అభిమానం ఉండడానికి అసలు కారణం ఆమె చిరంజీవి ఫ్యామిలీన్ని చూసుకున్న వ్యవహారశైలే కారణం. చిరంజీవి తండ్రి అయిన వెంకట్రావుగారు అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సురేఖగారు పవన్ ను వెనకేసుకొచ్చేవారట. చిరంజీవి కుటుంబం మొత్తని అంతలా చూసుకుంది కాబట్టే ఆమంటే చిరంజీవి కుటుంబంతో పాటు మెగా అభిమానులకు అంతటి గౌరవం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -