Sunday, May 12, 2024
- Advertisement -

ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ పై జక్కన్న షాకింగ్ కామెంట్స్

- Advertisement -

ఎన్టీఆర్ జైలవ టీజర్ తర్వాత.. రీసెంట్ గా కుశ టీజర్ ని రిలీజ్ చేశారు. రావణ టీజర్ లో విలనిజంతో, లవ టిజర్ లో క్లాస్ లుక్ తో అభిమానులను ఎంతో ఆకట్టుకున్న కుశ టిజర్ తో మాస్ జనాలను మెప్పించాడు. కుశ పాత్రను ఎంత ఆసక్తి రేకెత్తించేలా డైరెక్టర్ బాబి తెరకేక్కిన్చాడో టీజర్ చూస్తే అర్ధం అవుతోంది.

మాస్ జనాలు కోరుకునే డాన్స్ ను.. ఫైట్స్ ను మిక్స్ చేసి కుశ టిజర్ ను జనాలకు డైరెక్టర్ పరిచయం చేశాడు. ఇక ఈ కుశ టిజర్ లో ఎన్టీఆర్ లాంగ్ హెయిర్ స్టైల్ కనిపించాడు. తాజాగా ఈ యంగ్ గెటప్ పై రాజమౌళి కామెంట్స్ చేసారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ని తన తాత గారిలా బొద్దుగా చూడడానికే ఇష్టపడుతారు నందమూరి అభిమానులు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ట్రెండ్ ని ఫాలో అవుతూ యమదొంగ సినిమాకి లావు తగ్గాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్ రాజమౌళి చెప్పాడట. కాబట్టి ఎన్టీఆర్ బరువు తగ్గాడు. కాని ఇంకే డైరెక్టర్ చెప్పిన వినేవాడు కాదు. ఇక కుశ టిజర్ లోని లాంగ్ హెయిర్ స్లిమ్ ఫిజిక్ యమదొంగ సినిమా గెటప్ ని గుర్తు చేసేలా ఉన్నాయి అని రాజమౌళి కామెంట్స్ చేశారు. ఆ సినిమా తరువాత మళ్ళి ఎన్టీఆర్ దొంగ పాత్రలో నటిస్తున్న సినిమా ఇది.

ఎన్టీఆర్ తన కెరీర్ లోనే మొట్ట మొదటి సారిగా మూడు పాత్రలతో ఆకట్టుకోబోతున్న సినిమా ఇది. బాబి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేథా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. ఇటివలే పాటలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ సినిమాని ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -