Saturday, April 20, 2024
- Advertisement -

థియేటర్స్ ఓపెన్.. విడుదలకు రెడీ గా ఉన్న సినిమాలు ఇవే..!

- Advertisement -

అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 50 శాతానికి ప్రేక్షకులకు మాత్రమే థియేటర్లోకి అనుమతి ఇచ్చి అంటే 300 సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్లలో 150 మందిని మాత్రమే అనుమతించాలని చెప్పింది. కరోనా నిబంధనాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇండియన్ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఒక లేఖ విడుదల చేసింది.

తెలుగు రాష్ట్రాల లోని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఇంకా తమ స్పందన తెలియచేయలేదు. సరే థియేటర్లు తెరిస్తే.. విడుదల చేయడానికి సినిమాలు ఉన్నాయా? కరోనా కారణంగా థియేటర్లు మూసివేయడంతో నాని, సుధీర్ బాబు యాక్ట్ చేసిన ‘వి’ సినిమా ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘భానుమతి రామకృష్ణ’, ‘అమృత రామమ్’ తదితర సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అనుష్క నటించిన నిశ్శబ్దం, రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమాలో కూడా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్లు తెరిచిన తర్వాత విడుదల చేయడానికి సినిమాలు కొన్ని కనిపిస్తున్నాయి. రామ్ హీరో గా యాక్ట్ చేసిన ‘రెడ్’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.

ఓటీటీ నుండి ఆఫర్లు వచ్చినప్పటికి ఇవ్వలేదు. అలాగే మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న ‘ఉప్పెన’ సినిమాను కూడా ఓటిటికి ఇవ్వలేదు. సాయి ధరమ్ తేజ్ చేసిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్ గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ చేస్తున్న ‘లవ్ స్టోరీ’ కూడా త్వరలో రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ వకీల్ సాబ్ కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. నితిన్ హీరోగా యాక్ట్ చేస్తున్న ‘రంగ్ దే’, రవితేజ ‘క్రాక్’ సైతం కొన్ని రోజుల షూటింగ్ మిగిలి ఉంది. థియేటర్లు ఓపెన్ చేస్తే ఈ సినిమాలు రిలీజ్ అవుతాయా లేదా అన్నది ఇప్పుడు చూడాలి. నిర్మాతలు మాత్రం థియేటర్స్ ఓపెన్ అవుతే సినిమాలు రిలీజ్ చేసేందుకు రెడీగా ఉన్నారు.

టీచర్ ను పెళ్లి చేసుకున్న భూమిక..!

మెగాస్టార్ చిరంజీవి వదిలేసిన సినిమాలు ఇవే..!

మెగాస్టార్ వాడే కార్లు ఇవే.. వాటి ధర ఎంతంటే ?

మన స్టార్ హీరోలకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -