Tuesday, June 18, 2024
- Advertisement -

మీడియా పేరులో ‘ఆంధ్ర…… రాసేదేమో సీమాంధ్రులను వంచిస్తూ దారుణమైన వార్తలు

- Advertisement -

‘దొనకొండకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. 2014లో అధికారంలోకి వచ్చాక ఎన్నో చేస్తామని పాలకులు చెప్పారు. కానీ ఇప్పటి వరకూ ఒక్కటి కూడా రాలేదు’…….. ఆంద్రజ్యోతిలో వచ్చిన వార్త ఇది. ఇక ఈనాడు, ఆంద్రజ్యోతి మీడియా సంస్థల్లో ఈ వారంలోనే ఆంద్రప్రదేశ్‌కి పరిశ్రమలు ఏవీ రావడం లేదు. అభివృద్ధి ఏమీ జరగడంలేదు అన్న వార్తలు చాలానే వచ్చాయి. కాకాపోతే అలా జరగకపోవడానికి కారణం ఏంటి అని వివరించే సందర్భంలో మాత్రం నెపం అంతా కూడా మోడీపైన, ఉద్యోగులపైన వేస్తూ ఉంటారు.

ఇక టిడిపి భజన మీడియా నుంచి చాలానే వెబ్‌సైట్స్, ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రయత్నం అంతా ఒక్కటే. జగన్‌ని అతి పెద్ద విలన్‌గా చిత్రీకరించడం. చంద్రబాబు అభివృద్ధి చేయలేకపోవడానికి కారణంగా జగన్‌ని చూపించడం. జగనే ప్రతి పనికి అడ్డుపడుతున్నాడని జనాలను నమ్మించే ప్రయత్నం చేయడం. చంద్రబాబు కూడా చాలా సార్లు ఇలానే మాట్లాడుతూ ఉంటాడు. తుని ఘటన, రాజధాని ప్రాంతంలో పంటలు తగలబెట్టడం వరకూ అన్నింటికీ జగనే బాధ్యుడు అని చంద్రబాబు చెప్పాడు. మరి మూడున్నరేళ్ళయినా ఎందుకు విచారణ పూర్తి కాలేదు. జగన్ తప్పు చేసి ఉంటే బాబు వదుల్తాడా? జగన్‌ జైలుకు వెళ్ళాలని కోరుకోని పచ్చ బ్యాచ్ జనాలు ఉన్నారా? అలాంటిది జగన్ చేసిన తప్పులను చంద్రబాబు ఎందుకు నిరూపించడం లేదు? 2014ఎన్నికల సమయంలో రుణమాఫీ ఎలా చేస్తావు బాబు అని జగన్ అడిగితే…..జగన్ అక్రమాస్తులు స్వాధీనం చేసుకుని రుణమాఫీ చేస్తా అని చెప్పిన ఘనుడు చంద్రబాబు. మరి జగన్ ఆస్తులను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? జగన్ తప్పులు చేశాడు అని ప్రతి సందర్భంలోనూ చెప్తూ ఉండే చంద్రబాబు ఒక్క తప్పునైనా ఎందుకు నిరూపించలేకపోయాడు?

ఇక పేరులో ఆంద్ర అని ఉన్న ఒక పచ్చ మీడియా సంస్థ ‘అభివృద్ధిని అడ్డుకుంటేనే మేం 2019లో గెలుస్తాం’ అని వైసీపీ ఎంపి అన్నట్టుగా వార్త రాసింది. ఆ ఎంపి ఎవరు అన్న ప్రస్తావన ఉండదు. పేరు చెప్పరు. కానీ ఒక వైసీపీ ఎంపి చెప్పారు అని రాస్తారు. నిజంగా బుద్ధున్న రాజకీయ నాయకుడు ఎవడైనా అలా మాట్లాడతాడా? కానీ పచ్చ మీడియా మాత్రం ఇలాంటి విషం చల్లుతూనే ఉంటుంది. ఎందుకంటే జగన్‌ని చాలా పెద్ద విలన్ అని చూపిస్తే తప్ప ఆంద్రప్రదేశ్ ప్రజలు బాబుకు ఓటెయ్యరు కాబట్టి. ఇందులో అర్థం చేసుకోవాల్సిన సూక్ష్మం ఏంటంటే చంద్రబాబు విలన్ అని చెప్పి టిడిపి నేతలు, పచ్చ మీడియా బాగా నమ్ముతున్నట్టుంది. అందుకే జగన్ బాబు కంటే పెద్ద విలన్ అని చెప్పి జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తుంటుంది. 2014 ఎన్నిలకు ముందు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కూడా ఒక వ్యాసంలో ఇలానే రాసుకొచ్చాడు. ఆ వ్యాసంలో ఆయన చెప్పదల్చుకున్నది ఒకటే…..చంద్రబాబు కూడా చెడ్డవాడే కానీ జగన్ మాత్రం బాబు కంటే చెడ్డవాడు…….అందుకే సీమాంద్రప్రజలు బాబుకు ఓటెయ్యాలి అని చెప్పుకొచ్చాడు. 2014 నుంచీ ఇప్పటి వరకూ చంద్రబాబు చేసింది ఏమీ లేదు. ఇకపై చేయబోయేది కూడా ఏమీ లేదు. కానీ పచ్చ జనాలు మాత్రం జగన్ వచ్చి ఉంటే బాబు చేసినంత కూడా చేసి ఉండేవాడు కాదు అని జనాలను నమ్మించే ప్రయత్నంలో ఉన్నారు. తన మూడు రోజుల షలో నట నాయకుడు పవన్ కూడా ఇవే మాటలు చెప్పాడు. 2019లో కూడా బాబే దిక్కు అని ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు. 2014 విభజన సమయంలో ఆంద్రప్రదేశ్ ఎంత నష్టపోయిందో……హోదా, రైల్వేజోన్‌తో సహా విభజన చట్టంలో ఉన్న అన్నింటినీ పోగొట్టుకుని 2014-2019 మధ్య అంతకంటే ఎక్కువ నష్టపోయింది. అయినప్పటికీ 2019లో సీమాంధ్రులు మరోసారి బాబును నమ్ముతారా? ప్రచార గిమ్మిక్కులతో మరోసారి మాయచేయగలదా పచ్చ బ్యాచ్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -