Sunday, May 19, 2024
- Advertisement -

లేడీస్ సీక్రెట్స్ ఎందుకు దాచుకోలేరో తెలుసా..? 

- Advertisement -

 

Why Lades will relieve their secrets..?

ఆడవాళ్ల నోట్లో నువ్వుగింజ కూడా దాగదని ఓ నానుడి ఉంది. వాళ్లు ఎంత రహస్యకరమైన విషయాన్నైనా  వెంటనే స్నేహితులకో, లేక పక్కవారికో చెప్పేస్తుంటారు. ముఖ్యంగా ఇతరులతో చెప్పకు అన్న విషయాన్నే తర్వగా బయటపెట్టేస్తారు. సీక్రెట్స్ ని దాచుకోవడం ఆడవాళ్లకు చాలా కష్టమైన పని.

కానీ జెంట్స్ మాత్రం కేవలం డ్రింక్ చేసినప్పుడు మాత్రమే సీక్రెట్స్ బయటపెడుతుంటారు. లేడీస్ సీక్రెట్స్ దాచులేకపోవడానికి వెనుక ఆధ్యాత్మిక కారణాలతో పాటు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఆడవాళ్లు రహస్యాలు దాచుకోకుండా బయటకి చెప్పడానికి,  మహాభారతానికి కనెక్ట్ చేసి చెబుతుంటారు మన పెద్దలు. కురుక్షేత్రంలో అర్జునుడి చేతిలో చనిపోయిన కర్ణుడికి అంత్యక్రియలు నిర్వహించమని కుంతీదేవి.. ధర్మరాజుకు చెబుతుంది. రక్త సంబంధం లేని వారికి తాను అంత్యక్రియలు నిర్వహించనని ధర్మరాజు బదులిస్తాడు. అప్పుడు కుంతీదేవి.. కర్ణుడు… పాండవులందరికంటే పెద్దవాడన్న రహస్యాన్ని బయటపెడుతుంది. తామే తమ అన్నని చంపామని దుఃఖించిన ధర్మారాజు.. ఆడవాళ్ల నోట్లో రహస్యాలు దాగకుండు గాక అని శపిస్తాడు.

అలాగే లేడీస్ సీక్రెట్స్ దాచుకోలేకపోడానికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. మహిళలు సీక్రెట్స్ ఎక్కువ సమయం  దాచుకోవడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైన ఫీలింగ్ కలుగుతుందట. అందుకే.. వెంటనే వాటిని బయటకు చెప్పేస్తారని  అధ్యయనాలు చెబుతున్నాయి. వాళ్లకున్న క్యూరియస్ నేచర్ వల్లే.. ఏ రహస్యాన్ని దాచుకోలేకపోతున్నారని.. సైంటిస్టులు చెబుతున్నారు. మహిళలు 32 నిమిషాల కంటే ఎక్కువ సమయం సీక్రెట్స్ దాచుకోలేరని తమ అధ్యయనంలో తేలిందని అంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -