మగవాళ్లకు సెక్స్ వాంఛలు ఎక్కువ.. మగవాడు ఖాళీగా ఉంటే.. ప్రతి ఏడు సెకన్లకు ఒకసారీ సెక్స్ గురించినే ఆలోచిస్తాడని… కొన్ని పరిశోధనలు చెబుతూ ఉంటాయి. ఈ అధ్యయనాలను చాలా వరకూ మగవాళ్లు ఒప్పుకొంటారు.
అయితే ఆడవాళ్ల సెక్స్ వాంఛల గురించి జరిగే పరిశోధనలే.. చాలా గుంభనంగా ఉంటాయి. వీటిని ఔను అని అంగీకరించే వాళ్లూ ఉండరు.. కాదని స్పష్టం చేసే వాళ్లూ ఉండరు! అయితే పరిశోధనలు మాత్రం కొనసాగుతుంటాయి.. రకరకాల ఫలితాలను చెబుతూ ఉంటారు.
మరి ఇది కొత్త సర్వే కాదు కానీ.. ఎప్పుడో ఒక కాలంలోనే ప్రసిద్ధం ఆంగ్ల రచయిత మార్క్ ట్వెయిన్ చెప్పిన విషయం. సెక్స్ గురించి అధ్యయనాలు చేసిన ఈ సాహితీవేత్త.. ఈ విషయాన్ని చెప్పాడు. మగవాళ్లలో 50 యేళ్లు దాటితే సెక్స్ యావ పూర్తిగా తగ్గిపోతుందని ట్వెయిన్ అభిప్రాయపడ్డాడు. అయితే ఆడవాళ్లకు అమ్మమ్మలు అయినా సెక్స్ మీద యావ ఉంటుందని ట్వెయిన్ తేల్చాడు! ఇదే అధ్యయనాల్లోనే.. ఆడవాళ్లు ప్రతి రాత్రీ సెక్స్ ను కోరుకొంటారని కూడా వ్యాఖ్యానించిన ఘనుడు మార్క్ ట్వెయిన్.
ఒక వయసు వచ్చాకా మగవాడు ఏడాదిలో వంద సార్లు సెక్స్ లో పాల్గొంటే అదే గొప్ప అని ఆయన అభిప్రాయపడ్డాడు. అదే ఆడవాళ్లలో మాత్రం ప్రతి రోజూ సెక్స్ ను కోరుకొనే చిలిపితనం , కోరిక ఉంటుందనేది ట్వెయిన్ థియరీ. మరి సాహితీవేత్తగా ఎంతోమంది అభిమానగణాన్ని కలిగి ఉన్న ట్వెయిన్ థియరీలో నిజమెంతో మరి!