చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం జియోమికి…. ఇండియన్స్ మెంటాలిటీ ఇంతకాలానికి అర్ధమైనట్టుంది.హడావిడిగా స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసేసి మార్కెట్ ను డిస్ట్రబ్ చేసి ఏదో సాధించేయాలనుకున్న ఆ కంపెనీకి మనవాల్ల డిస్కౌంట్ స్కీంలోని మతలబుడ ఇపుడు తెలుసొచ్చినట్టుంది.
అందుకే కాబోలు జియోమి ‘రెడ్ మి నోట్’ 4G ప్రైజ్ ను ఒక్కసారిగా 2వేలకు తగ్గించేసింది.నిజానికి జియోమి 4G రేటు 9999/- గా డిసైడ్ చేసి రిలీజ్ చేస్తే…. వర్కవుట్ కాలేదు. అందుకే రెండు కట్ చేసి 7999/- గా ప్రైజ్ రేట్ డిసైడ్ చేశారు. యురేకా మాదిరిగా 5.5 ఇంచ్ డిస్ ప్లే తో 13 పిక్సెల్ కెమారా ఇచ్చి…. ఫ్రంట్ లో సెల్ఫీ తీసుకోమని 5 మెగా పిక్సెల్ క్యామ్ ను షురూ చేశారు.
2GB RAM,8GB స్టోరేజ్ లను సమకూర్చి….64 జిబి స్టోరేజ్ పెంచుకునే సదుసాయాన్ని కూడా ఇచ్చారు.కాకపోతే…. గొరిల్లా గ్లాస్ లేకపోవడం,మ్యూజిక్ యాప్స్ లాక్ స్క్రీన్ లో కంట్రోల్ కాలేకపోవడం,సింగిల్ సిమ్ మాత్రమే ఉండడం… ఈ జియోమి రెడ్ మి నోట్ కు మైనస్ పాయింట్స్ గా చెపుకోవచ్చు. ఏది ఎలా ఉన్నా రెండు తగ్గితే తప్ప సేల్స్ పెరగలేదు