Thursday, May 2, 2024
- Advertisement -

హమ్మయ్య అంతా సేఫ్.. హిందూ మహాసముద్రంలో కూలిపోయిన చైనా రాకెట్!

- Advertisement -

చైనా రాకెట్ ‘లాంగ్ మార్చ్-5 బీ’ ఎక్కడ పడుతుందో, ఎంత నష్టం కలిగిస్తుందోనని ఇన్నాళ్లూ బిక్కుబిక్కుమంటూ వచ్చింది ప్రపంచం. కానీ ఇప్పుడా భయం లేదు. ఇది తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించిందని, ఆదివారం ఉదయం హిందూమహాసముద్రంలో కూలిపోయిందని చైనా ప్రకటించింది. దీని శకలాలు శూన్యస్థితిలోనే మండిపోతూ చివరికి భూ వాతావరణంలోకి ప్రవేశించాయి. నిర్ధేశిత కక్షలో నుంచి పట్టుజారి ఈ రాకెట్ ఎక్కడైనా భూమిని అతి వేగంగా తాకవచ్చునని, దీనితో అపార ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లనుందని అమెరికాతో పాటు పలుదేశాల రాకెట్, అంతరిక్ష పరిశోధనల నిపుణులు విశ్లేషించారు.

18 టన్నుల ఈ భారీ రాకెట్ కథ ముగిసింది. ఏప్రిల్ 29 న దీన్ని చైనా అంతరిక్షంలోకి ప్రయోగించింది. మే 9 న తెల్లవారుజామున ఈ రాకెట్ మళ్ళీ భూవాతావరణంలోకి ప్రవేశించింది. మాల్దీవుల సమీపంలో ఈ మహా సముద్రంలో కూలింది. దీని శిథిల భాగాలు రీ-ఎంట్రీ సమయంలోనే నాశనమయ్యాయి అని వారు వివరించారు. అమెరికా మిలిటరీ డేటాను వినియోగించుకునే స్పేస్ ట్రాక్-కూడా దీని రీ-ఎంట్రీని ధృవీకరించింది. అమెరికన్, యూరోపియన్ అంతరిక్ష పరిశోధకులు ఇది ఎక్కడ పడుతుందోనని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ వచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా ఓ వైపు చైనా మూలకారక కరోనా వైరస్ భయాలు పట్టిపీడిస్తున్న దశలోనే నింగిలో ఈ రాకెట్ విశృంఖల పయనం, ఎటు నుంచి ఎటు దూసుకువస్తుందో, ఏ దేశం నెత్తిన పడి ఏ విధ్వంసం సృష్టిస్తుందో తెలియక ఇన్ని నాళ్లు అంతటా భయాందోళనలు నెలకొన్నాయి. మొత్తానికి ఆదివారం ఉదయం హిందూమహాసముద్రంలో కూలిపోయిందని చైనా ప్రకటించింది. గత ఏడాది లాంగ్ మార్చ్ రాకెట్ కి చెందిన మరో రాకెట్ ఐవోరీ కోస్ట్ లోని కొన్ని గ్రామాలపై పడింది.. అప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు.

ఆ లేడీ డైరెక్టర్ తో ప్రభాస్ నెక్స్ట్ చిత్రం.. కథ అదే!

పచ్చి నిజం అంటూ జబర్దస్త్ భజన భారీగా చేస్తున్న ఇంద్రజ..!

కరోనా వైరస్ పై మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్.. ఏంటంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -