Thursday, May 2, 2024
- Advertisement -

నామ‌మాత్ర‌పు పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్‌…గేల్‌కు చివ‌రి ప్ర‌పంచ‌క‌ప్‌

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్‌నుంచి అప్ఘ‌న్‌, విండీస్ ఇప్ప‌టికే నిష్క్ర‌మించాయి. ఇప్పుడు రెండు జ‌ట్ల మ‌ధ్య నామ మాత్ర‌పు పోరు కాసేప‌ట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఒక మ్యాచ్‌ మాత్రమే గెలవగా, ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఒక మ్యాచ్‌ వర్షం​ కారణంగా రద్దయ్యింది. ఇక అఫ్గానిస్తాన్‌ అస్సలు బోణీనే కొట్టలేదు. ఎనిమిది మ్యాచ్‌లకు గాను ఎనిమిదింట పరాజయం చవిచూసింది. దాంతో తమ చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని యోచిస్తోంది. ఇరు జట్ల మధ్య ముఖాముఖి పోరులో ఐదు వన్డేలు జరగ్గా మూడింట అఫ్గానిస్తాన్ విజయం సాధించగా‌, ఒక దాంట్లో వెస్టిండీస్‌ గెలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచి విజ‌య‌వంతంగా టూర్ ముగించాల‌ని ఇరు జ‌ట్లు ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి.

లీడ్స్ ఆతిథ్యమిస్తున్న ఈ లీగ్ మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కరీబియన్ జట్టులో ఓపెనర్ సునీల్ ఆంబ్రిస్ స్థానంలో ఎవిన్ లూయిస్, పేసర్ షానన్ గాబ్రియెల్ కు బదులుగా కీమార్ రోచ్ జట్టులోకి వచ్చారు. ఇక ఆఫ్ఘన్ జట్టులోనూ రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. హమీద్ హసన్, హస్మతుల్లా స్థానంలో సయీద్ షిర్జాద్, దౌలత్ జాద్రాన్ తుది జట్టులో ఆడనున్నారు. క్రికెట్ చరిత్రలో అత్యంత విధ్వంసక బ్యాట్స్ మన్ గా పేరుగాంచిన విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ తన కెరీర్ లో చివరి వరల్డ్ కప్ మ్యాచ్ లో బరిలో దిగుతున్నాడు.

వెస్టిండీస్‌
జేసన్‌ హెల్డర్‌(కెప్టెన్‌), క్రిస్‌గేల్‌, ఎవిన్‌ లూయిస్‌, షాయ్‌ హోప్‌, హిమ్రాన్‌ హెట్‌మెయిర్‌, నికోలస్‌ పూరన్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, ఫాబియన్‌ అలెన్‌, షెల్డాన్‌ కాట్రెల్‌, ఓష్నీ థామస్‌, కీమర్‌ రోచ్‌

అఫ్గానిస్తాన్‌
గుల్బదిన్‌ నైబ్‌(కెప్టెన్‌), రహ్మత్‌ షా, అస్గర్‌ అఫ్గన్‌, మహ్మద్‌ నబీ, సమిల్లాహ్‌ షిన్వారి, నజిబుల్లా జద్రాన్‌, ఇక్రమ్‌ అలీ ఖిల్‌, రషీద్‌ ఖాన్‌, దవ్లాత్‌ జద్రాన్‌, సయ్యద్‌ షిర్‌జాద్‌, ముజీబ్‌ ఉర్‌ రహ్మన్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -