Monday, May 5, 2025
- Advertisement -

ఐపీఎల్ 2024..సర్వం సిద్ధం!

- Advertisement -

ఐపీఎల్ 2024 ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రేపటి నుండి మెగా టోర్ని ప్రారంభంకానుండగా తొలి మ్యాచ్‌లో ఆర్సబీతో చెన్నై తలపడనూఉంది.చెపాక్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గత సీజన్ లతో పోల్చితే ఈసారి ఐపీఎల్ కొంత ప్రత్యేకమైనదే. ఎందుకంటే ఆటగాళ్లను భారీగా చేంజ్ చేశారు ప్రాంఛైజీలు. హైదరాబాద్ కెప్టెన్ గా పాట్ కమిన్స్ వ్యవహరిస్తుండగా కమిన్స్ సారథ్యంలో ఆస్ట్రేలియా వరల్డ్ కప్‌ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆయన కెప్టెన్సీపై హైదరాబాద్‌ భారీ ఆశలు పెట్టుకుంది.

ఈ సీజన్‌లో తనది కొత్త పాత్ర అని ధోని చెప్పిన నేపథ్యంలో మహి పాత్ర ఏంటనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటివరకు టైటిల్ గెలవని ఆర్సీబీ, డిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తొలిసారి కప్పు ఎగరేసుకుపోవాలని భావిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా వ్యవహరించనుండగా గత రెండేళ్లుగా హర్ధిక్ కెప్టెన్సీలో ఉన్న గుజరాత్ ఈసారి యువ సంచలనం గిల్ సారథ్యంలో నడవనుంది. ప్రతి జట్టు మార్పులతో బరిలోకి దిగుతుండటంతో ఈసారి ఐపీఎల్ ఆసక్తిగా జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని క్రీడా అభిమానులు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -