క్రికెటర్లకు, సినిమా హీరోయిన్ల మధ్య ప్రేమ వ్యవహారా ఎంత చెప్పుకున్నా తక్కువే. సెలెబ్రెటీల ప్రేమ సంగతులకు, సాధారణ ప్రజానీకానికి సోషల్ మీడియా వారధిలా పనిచేస్తోంది. అసలే సెలెబ్రిటీలు, అందునా ప్రేమ ముచ్చట్లు కావడంతో నెటిజన్లు వాటి పట్ల బాగా ఆకర్షితులవుతున్నారు. అయితే సోషల్ మీడియాలో వచ్చేటవన్నీ నిజం కావు. ఇలాంటి రూమర్స్ లో చిక్కుకుంది టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వర్.
హీరోయిన్ అనుపమ, టీమిండియా క్రికెటర్ జస్‌ప్రిత్ బుమ్రా లవ్‌లో ఉన్నారని… నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ‘ప్రేమమ్’ నటి అనుపమ పరమేశ్వరన్, టీమిండియా పేసర్ బుమ్రా ప్రేమించుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. దీనికి తోడు సోషల్‌మీడియాలో బుమ్రా ఫాలో అవుతున్న ఏకైక నటి అనుపమేనని సమాచారం. ఈ వార్తలపై వెంటనే స్పందించింది అనుపమ పరమేశ్వర్.
బుమ్రా తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని, అంతకుమించి తమ మధ్య ఎలాంటి రేలషన్‌షిప్ లేదని ఈ సందర్బంగా ఆమె పేర్కొంది. ఎవ్వరికీ ఉపయోగం లేని ఇలాంటి వార్తలు పుట్టించడం వల్ల ఏమొస్తుందో నాకైతే అర్థం కావడం లేదు.. అని ఘాటు రియాక్షన్ ఇచ్చింది అనుపమ.
ఇదే బుమ్రాతో రాశి ఖన్నా డేటింగ్ చేస్తోందని గతంలో వార్తలు రాగా.. వాటిని వెంటనే ఖండించింది రాశి. దీంతో ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పడగానే ఇప్పుడు అదే బుమ్రాతో అనుపమ పరమేశ్వరన్ ని లింక్ చేయడం జనాల్లో హాట్ టాపిక్‌గా మారింది.