Friday, May 10, 2024
- Advertisement -

ధోనీని ఫాలో అయి బొక్క‌బోర్ల ప‌డ్డ పాక్ కెప్టెన్ స‌ర్ఫ‌రాజ్‌…

- Advertisement -

ఆసియా క‌ప్ సూప‌ర్ 4లో గెల‌వాల్సిన మ్యాచ్‌లో బంగ్లా చేతిలో పాక్ చేతిలో చేతులెత్తేసింది. పాక్‌పై బంగ్లాదేశ్‌ 37 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ స‌ర్ఫ‌రాజ్ టీమిండియా కీప‌ర్ ధోనీనీ అనుక‌రించి బొక్క‌బోర్లాప‌డ్డారు. దాంతో ఓడిపోయి భారీ మూల్యం చెల్లించుకున్నారు.

ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇటీవల ముగిసిన మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్‌ని ఔట్ చేసేందుకు మహేంద్రసింగ్ ధోనీ.. స్లిప్‌లో ఉన్న ఫీల్డర్‌ ధావన్‌‌ని స్క్వేర్‌ లెగ్‌లోకి మార్చి ఫ‌లితాన్ని రాబ‌ట్టాడు. తర్వాత బంతికే ధావన్‌కు షకీబ్‌ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు

ఇదే ప్లాన్‌‌ని బుధవారం రాత్రి బంగ్లాదేశ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో కాపీ కొట్టిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ స్లిప్‌లో ఉన్న ఫీల్డర్‌ని వేరొక చోటికి మార్చాడు. కానీ.. రెండు బంతుల వ్యవధిలోనే స్లిప్‌లో గాల్లోకి లేచిన బంతి బౌండరీకి వెళ్లింది. ఒకవేళ ఆ ఫీల్డర్ అక్కడే ఉండి ఉంటే.. పాక్‌కి ఓ వికెట్ లభించేది. ఇప్పుడు ఈ వీడియో వైర‌ల్ అవుతున్నాయి.

https://twitter.com/LOLendraSingh/status/1043420025443344384

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -