Wednesday, May 8, 2024
- Advertisement -

రేవంత్ రెడ్డి ఇంటి ద‌గ్గ‌ర ఉద్రిక్త‌త‌..

- Advertisement -

తెలంగాణాలో ఒక్క‌సారిగా రాజ‌కీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ రేవంత్ రెడ్డి ఇళ్లు, ఆయ‌న స‌న్నిహితు కార్యాల‌యాల‌పై ఉద‌యం నుంచి ఈడీ, ఐటీ దాడుదులు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సొంత నియోజ‌క వ‌ర్గంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌లోని ఇంటికి చేరుకున్నారు. ఆయ‌న ఇంటి వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఆయ‌న అనుచ‌రులు పెద్ద ఎత్తున ఇంటి ద‌గ్గ‌ర‌కు చేరుకున్నారు.

ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి ఏక్ష‌ణ‌మైనా అరెస్ట్ అయ్యే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే అధికారులు అరెస్ట్‌కు రంగం సిద్ధం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంకేతాంగానే అందుకు తగ్గట్లుగానే హైదరాబాద్ లోని రేవంత్ ఇంటివద్ద భారీ పోలీసులు మొహరించడంతో ఆ అనుమానం ఇంకా పెరిగిపోయింది. అంతేకాకుండా రేవంత్ కోస్గి సభలో బావోద్వేగంగా మాట్లాడుతూ… తాను జైలుకు వెళ్లినా అక్కడి నుండే నామినేషన్ వేస్తానన్నారు. దీంతో తనను అరెస్ట్ చేస్తారని రేవంత్ కు ముందుగానే సమాచారం అంది ఇలా మాట్లాడారా అన్న అనుమానం కలుగుతోంది.

ఇంట్లోకి రేవంత్‌రెడ్డి ఆయ‌న భార్య‌ను మాత్ర‌మే అధికారులు అనుమ‌తించారు.రేవంత్ ఇంటిచుట్టూ పోలీసులు ఇప్పటికే భారీకేడ్లు ఏర్పాటు చేశారు. కార్యకర్తలను, అభిమానులను అదుపు చేస్తున్నారు. ఇలా రేవంత్ ఇంటివద్ద గంభీర వాతావవణం నెలకొంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని అటు రాజకీయ నాయకుల్లో ఇటు ప్రజలు ఉత్కంట నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -