Saturday, May 4, 2024
- Advertisement -

ఏషియన్ గేమ్స్ లో స్వ‌ర్ణం గెలిచిన 16 ఏళ్ల బుడ‌త‌డు…

- Advertisement -

ఏషియన్ గేమ్స్‌లో మూడో రోజు ఆరంభంలో భారత షూటర్లు అదరగొట్టారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 16 ఏళ్ల సౌరభ్ చౌధురీ స్వర్ణం గెలవగా.. మరో షూటర్ అభిషేక్ వర్మ కాంస్యం సాధించాడు. పదహారేళ్ల సౌరభ్ చౌదరి 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో గురితప్పలేదు. జపాన్ కు చెందిన తొమొయుకి మత్సుదాతొో పాటు స్వదేశ ప్రత్యర్థి అభిషేక్ వర్మలకు గట్టి పోటీ ఇచ్చిన సౌరభ్, 240.7 పాయింట్లతో బంగారు పతకాన్ని సాధించాడు.

గత జూన్‌లో జర్మనీలో జరిగిన జూనియర్ వరల్డ్ కప్‌లో సౌరభ్ చౌధురీ స్వర్ణం గెలవడంతోపాటు 243.7 పాయింట్లతో ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. మత్సుదాకు రజతం, అభిషేక్ కు కాంస్యం దక్కాయి. 18 రౌండ్లు ముగిసేసరికి రెండో స్థానంలో నిలిచి ఫైనల్స్ కు చేరుకున్న సౌరభ్, ఆపై తన సత్తా చాటాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -