Tuesday, May 14, 2024
- Advertisement -

కౌశ‌ల్ అంటే ఎందుకు వీరికి అంత ప‌గ‌?

- Advertisement -

సోమ‌వారం జ‌రిగిన ఎపిసోడ్‌తో 70 రోజులు పూర్తి చేసుకుంది బిగ్‌బాస్ రెండో సీజ‌న్.ఇప్ప‌టికే బిగ్‌బాస్ హౌస్ నుంచి చాలా మంది బ‌య‌టికి వెళ్లిన‌,షోకి నెల రోజులే ఉండటంతో ఇంకా చాలా మంది ఎలిమినేష‌న్ కావ‌ల్సి ఉంది.ఇక సోమవారం జ‌రిగిన ఎపిసోడ్‌లో ఎలిమినేష‌న్స్‌కు నామినేష‌న్ ప్ర‌క్రియ న‌డిచింది.కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరిగా పిలిచిన బిగ్ బాస్ నామినేషన్స్ కోసం హౌస్ మేట్స్ లో ఇద్దరి పేర్లు, వారిని ఎందుకు నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పమని చెప్పారు. ముందుగా సామ్రాట్ వెళ్లి పూజ రామచంద్రన్, కౌశల్ ని నామినేట్ చేశాడు.

తనీష్.. దీప్తి నల్లమోతు, పూజాలను నామినేట్ చేయగా కౌశల్.. సామ్రాట్, తనీష్ లను నామినేట్ చేశాడు. ఇలా హౌస్ లో ఈ వారం నామినేషన్స్ లో కౌశల్, తనీష్, పూజా రామచంద్రన్, దీప్తి నల్లమోతు నిలిచారు. ఎప్ప‌టిలాగే హౌస్‌మెట్స్ మరోసారి కౌశ‌ల్‌ను టార్గెట్ చేశార‌ని తెలుస్తుంది.చాలామంది కౌశ‌ల్ పేరును ప్ర‌తిపాదించ‌డంతో ఈ వారం ఎలిమినేష‌న్‌లో మ‌రోసారి నామినేట్ అయ్యాడు. వీరిలో ఎవ‌రు ఎలిమినేష‌న్ అవుతారో వేచి చూడాల్సిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -