మహిళపై లైంగిక దాడి చేసిన క్రికెటర్‌కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఇది జరిగింది మన దేశంలో కాదు. ఆసీస్ సంతతికి చెందిన 23 ఏళ్ల అలెక్స్ హెప్‌బర్న్‌కు ఓ మహిళపై లైంగిక దాడి చేసిన కేసులో బ్రిటిష్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అలెక్స్ అతని ఫ్రెండ్స్ కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ పెట్టి అందులో ఎక్కువ మంది మగువలతో శృంగారం చేయాలంటూ పోటీ పెట్టుకునేవారని తెలుస్తోంది. హెప్‌బర్న్ జట్టు సహచరుడైన జోయి క్లార్క్ ఓ నైట్‌క్లబ్‌లో తనకు పరిచయం అయందని అతనితో పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నానని బాధితురాలు కోర్టుకు తెలిపింది.
కాని జోయి క్లార్క్ తెల్లవారుజామున బెడ్‌రూమ్ నుంచి వెళ్లిపోయిన సంగతి నాకు తెలియదని , అనంతరం హెప్‌బర్న్ రహస్యంగా గదిలోకి చొరబడ్డాడని, ఇంకా నిద్రిస్తున్న తనపై అతను లైంగిక చర్యకు పాల్పడ్డాడు అని తెలిపింది. క్లార్క్‌గా భావించి అతనితో శృంగారంలో పాల్గొన్నానని బాధితురాలు పేర్కొంది. కాని తరువాత చూస్తే అతను క్లార్క్ కాదని తెలియడంతో షాక్ తిన్నానని బాధితురాలు కోర్టుకు తెలిపింది. దీనిని తీవ్రమైన చర్యగా భావించిన కోర్టు అతనికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది.
- Advertisement -
రేప్ కేసులో క్రికెటర్‌కు జైలు శిక్ష
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -