Thursday, May 9, 2024
- Advertisement -

భారతీయ యువతితో పీకల్లోతు ప్రేమలో ఆసిస్ స్టార్ ఆల్‌రౌండర్….

- Advertisement -

మైదానంలో సిక్సర్లతో విరుచుకుపడే ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ ఓ భారతీయ యువతికి క్లీన్ బోల్డ్ అయ్యాడు. ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నాడు.ఆమెతో చాలాకాలంగా చెట్టాపట్టాల్‌ వేసుకుంటూ ఆసీస్‌ వీధుల్లో తిరిగేస్తున్నాడు. విందు, వినోదాల్లో మునిగి తేలుతున్నాడు.

భారత సంతతికి చెందిన ఆ అమ్మాయి పేరు విని రామన్.ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ భారతీయ కుటుంబానికి చెందిన రామన్‌కు మ్యాక్స్‌వెల్‌తో ఎలా పరిచయమైందో తెలియదు కానీ..వీరిద్దరి బంధం ఇప్పుడు ఫెవికాల్ అంత స్ట్రాంగ్‌గా ఉందన్న కథనాలు వినిపిస్తున్నాయి.

ఈ బిగ్‌ హిట్టర్‌ మైదానంలో ఎంత భయంకరంగా ఆడతాడో మైదానం ఆవల అంత సౌమ్యుడని తెలిసింది. వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారన్న విషయంపై స్పష్టత లేదు.బహుశా త్వరలోనే పెళ్లి ప్రకటన చేయవచ్చునన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.మ్యాక్స్‌వెల్-విని రామన్ జంట ఒక్కటైతే భారతీయ యువతిని పెళ్లాడిన రెండో ఆసీస్‌ క్రికెటర్‌గా నిలుస్తాడు మ్యాక్స్‌వెల్.అంతకుముందు ఆసీస్ ఫాస్ట్ బౌలర్ షాన్ టైట్ కూడా భారతీయ యువతినే పెళ్లాడాడు.

https://www.instagram.com/p/B1iPLxkFMsh/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -