Tuesday, May 14, 2024
- Advertisement -

కపిల్ రికార్డును బీట్ చేయనున్న ఇషాంత్ …

- Advertisement -

విండీస్ టూర్ లో టెస్టుల్లో ఇషాంత్ శర్మ వికెట్లతో అదరగొడుతున్నారు. ఇాషాంత్ శర్మ ముంగిట మరో అరుదైన రికార్డు ఉంది.శుక‍్రవారం నుంచి విండీస్‌తో ఆరంభమయ్యే రెండో టెస్టులో ఇషాంత్‌ వికెట్‌ తీస్తే భారత దిగ్గజ బౌలర్‌ కపిల్‌దేవ్‌ రికార్డును అధిగమిస్తాడు.ఆసియా ఖండం అవతల అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్‌గా నిలిచేందుకు ఇషాంత్‌ ఒక్క వికెట్ దూరంలో ఉన్నారు.

ఆసియా బయట ఇప్పటివరకూ ఇషాంత్‌ శర్మ 45 వికెట్లను సాధించాడు. దాంతో కపిల్‌దేవ్‌ సరసన నిలిచాడు.రేపటి నుంచి ప్రారంభమయ్యే టెస్టులో ఇషాంత్‌ వికెట్‌ తీస్తే కపిల్‌దేవ్‌ను అధిగమిస్తాడు.భారత్‌ తరఫున అనిల్‌ కుంబ్లే(50) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, కపిల్‌దేవ్‌, ఇషాంత్‌లు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.

గత టెస్టులో ఇషాంత్‌ శర్మ ఎనిమిది వికెట్లతో విజృంభించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన ఇషాంత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు. ఫలితంగా కపిల్‌దేవ్‌ సరసన నిలిచాడు.మొదటి టెస్టులో టీమిండియా 318 పరుగుతేడాతో విండీస్ ను చిత్తు చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -