- Advertisement -

బాల్‌ట్యాంప‌రింగ్ ఫ‌లితం…కోచ్‌పై వేటు, వార్న‌ర్‌, స్మిత్‌పై ఏడాదిపాటు నిషేధం..

- Advertisement -

బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేస్తోంది. ట్యాంపరింగ్‌ వ్యవహారాన్ని తేలికగా తీసుకోవద్దన్న ప్రధాని టర్న్‌బుల్‌ సూచన మేరకు ఆస్ట్రేలియా క్రికెట్‌(సీఏ).. స్మిత్‌, వార్నర్‌, బెన్‌క్రాఫ్ట్‌లపై కొరడా ఝుళిపించడం ఖాయమని, నాలుగో టెస్టు ప్రారంభానికి ముందే లీమన్‌ రాజీనామా చేస్తాడని సర్వత్రా చర్చజరుగుతోంది.

ట్యాంపరింగ్ బాగోతం యావత్ ఆస్ట్రేలియాను ఓ కుదుపు కుదిపిన నేపథ్యంలో కోచ్ పదవి నుంచి వెంటనే తప్పుకోవాలని నిర్ణయించినట్టు లీమన్ క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలిపాడని సమాచారం. 24 గంటల్లోగా తను వైదొలిగే విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

అంతర్గత విచారణ నిమిత్తం క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో జేమ్స్ సదర్లాండ్ సౌతాఫ్రికా బయల్దేరడానికి లీమన్‌ను తొలగించాలని అనుకోవడమే ప్రాథమిక కారణమని తెలుస్తోంది.

ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ముందు జొహన్నస్‌బర్గ్‌లో సదర్లాండ్ ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్‌ను కలుస్తారు. అనంతరం లీమన్‌తోపాటు బాన్‌క్రాఫ్, స్మిత్, వార్నర్‌ల భవితవ్యం తేలుస్తారు. లీమన్ ఐదేళ్లుగా ఆసీస్ కోచ్‌గా బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. అతడి శిక్షణలో ఆసీస్ రెండుసార్లు యాషెస్ సిరీస్‌‌ను గెలుచుకుంది. 2019 యాషెస్ తర్వాత కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని ఆయన గతంలో స్పష్టం చేశారు. బాల్ ట్యాంపరింగ్ గురించి లీమన్ ఇంత వరకూ బహిరంగంగా మాట్లాడలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -