Saturday, May 18, 2024
- Advertisement -

బంగ్లా నాగినీ డ్యాన్స్‌కు కౌంట‌ర్ ఇచ్చిన లంక ….

- Advertisement -

శ్రీ లంకలో జరుగుతున్న ట్రై సిరీస్‌లో బంగ్లా, లంక మ‌ధ్య‌జ‌రుగుతున్న మ్యాచ్‌లో అస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో బంగ్లా ఆటగాడు ముష్ఫికర్ రహీమ్‌ నాగిని డ్యాన్స్‌ చేసి అలరించిన సంగతి తెలిసిందే.

ముష్ఫికర్ రహీమ్‌ నాగిని డ్యాన్స్‌కు శ్రీలంక కౌంటర్ ఇచ్చింది. బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో ముష్ఫికర్ క్రీజులో ఉన్నాడు. లంక బౌలర్ అపోన్స్ ఓవర్ వేస్తున్నాడు. అయితే రహీం భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. వెంటే అపోన్స్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టాడు. రహీమ్‌కు కౌంటర్‌గా చేతులు రెండు దగ్గరకు చేసి… నాదస్వరం ఊదాడు. ఇప్పుడు ఈ వీడియో హాట్‌టాపిక్‌గా మారింది.

అంటే అపోన్స్ కౌంటర్‌కు అర్థం… నువ్వు నాగిని డ్యాన్స్ చేస్తే… నేను నాదస్వరం ఊదుతానని చెప్పినట్లు. అటు ఫ్యాన్స్‌లో కూడా కొంతమంది సరిగ్గా ఇలాగే… పాము ఎదురుగా ఉంటే… బూర వాయిస్తూ ఓ వ్యక్తి కంట్రోల్ చేస్తున్నట్లు పెయింటింగ్‌లు వేసుకొచ్చారు. ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తం మీద బంగ్లా నాగినికి లంక నాదస్వరంతో భలే చెక్ పెట్టేశారని ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.

blob:https://www.sakshi.com/58c4e956-d4b5-4469-b5d4-5b60c4898586

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -