- Advertisement -

చైనాలో అయితే జ‌గ‌న్‌ను బ‌హిరంగంగా ఉరితీసే వారు…టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్‌

- Advertisement -

వైసీపీ, టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. మామూలుగానే రెండు పార్టీల మ‌ధ్య విమ‌ర్శ‌లు సాధార‌నం. కాని కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నేప‌థ్యంలో మ‌రింత మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ప్రత్యేక హోదా అంశంపై ఇతర పార్టీల మద్దతు కూడగట్టి కేంద్రంపై ఎందుకు పోరాటం చేయలేదని చంద్రబాబును నిలదీశారు వైసీపీ నేత‌లు.

తాజాగా జ‌గ‌న్‌పై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్ ఘోర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. చైనాలో అయితే జ‌గన్‌లాంటి ఆర్థిక నేర‌గాల్ల‌ను ఈపాటికి బ‌హిరంగంగా ఉరితీసేవార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆర్థిక నేరస్తులను ప్రధాని మోదీ ఎలా కలుస్తారని ప్రశ్నించారు. మోదీ అనుసరిస్తున్న విధానాలు అనైతికమని అన్నారు. సామ్రాజ్య విస్తరణ కాంక్షతో మోదీ, అమిత్ షాలు ముందుకు వెళుతున్నారని విమర్శించారు.

బీజేపీ అండతో టీడీపీ గెలవలేదని… మోదీ, పవన్ కల్యాణ్ లను కలవక ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే ఘన విజయం సాధించిందని చెప్పారు. మోదీ-పవన్-జగన్ ల మధ్య ట్రయాంగ్యులర్ స్టోరీ నడుస్తోందని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -