Wednesday, May 1, 2024
- Advertisement -

ఆకాశానికెత్తేసిన వార్నర్

- Advertisement -

భువనేశ్వర్ కుమార్. భారత మీడియం పేసర్. ఐపిఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను గెలిపించిన బౌలర్. ఈ యువ ఫేసర్ ని ఆ జట్టు కెప్టెన్ వార్నర్ ఆకాశానికి ఎత్తేశాడు. భువీ.. వరల్డ్ క్లాస్ బౌలర్. అతడి బౌలింగ్ లో ఆడాలనుంది అని వార్నర్ అన్నాడు. ఫ్లాట్ వికెట్ పై భువనేశ్వర్ వేసే బంతులను ఓ బ్యాట్స్ మెన్ గా ఎదుర్కోవాలని ఉంది.

భువీ తన తొలి బంతి నుంచే బ్యాట్స్ మెన్ ను ఎలా కట్టడి చేయాలో తెలుసు.  భువనేశ్వర్ పై ఏ కెప్టెన్ అయినా ఎంతో నమ్మకం పెట్టుకోవచ్చునని, అతను భారత జట్టులోకి రావచ్చు.. పోవచ్చు కాని అతని బౌలింగ్ ప్రతిభ మాత్రం అసాధారణం అని వార్నర్ అన్నాడు.

ఐపిఎల్ టోర్నమెంట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా భువనేశ్వర్ కుమార్ నిలిచాడు. దీంతో అతని బౌలింగ్ పై ప్రస్తుత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, విమర‌్శకులు కూడా ప్రసంశలు కురిపిస్తున్నారు.   

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -