Monday, May 6, 2024
- Advertisement -

మ‌హేష్ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు!

- Advertisement -

ఇప్ప‌టికే ఆ చిత్రం గురించి ర‌క‌ర‌కాల కామెంట్లు వినిపిస్తున్నాయి. సోష‌ల్ నెట్‌వ‌ర్కింగుల్లో సెటైర్లు మీద సెటైర్లు ప‌డిపోతున్నాయి. ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల ఈ చిత్రం క‌థ గురించి మ‌హేష్ బాబుకు ఎలా చెప్పి ఉంటాడూ అనే స్పూఫ్ వీడియోలు త‌యారైపోయాయి. థియేట‌ర్‌కు వెళ్లిన ప్రేక్ష‌కులు ఎలా స్పందిస్తున్నారూ అనేది కాస్త ఎట‌కారంగా చూపించే యానిమేష‌న్లూ క‌నిపిస్తున్నాయి.

ఇటీవ‌లి కాలంలో విడుద‌లైన ఏ చిత్రానికి ఇంత నెగెటివ్ ప‌బ్లిసిటీ లేద‌నే చెప్పుకోవాలి. బ్రహ్మోత్స‌వం చిత్రం తొలి ఆట అయిన ద‌గ్గ‌ర నుంచి మొద‌లైన నెగెటివ్ టాక్ ఇప్పుడు ఎక్క‌డికో చేరిపోయింది. ఇది చాల‌ద‌న్న‌ట్టు ప్రొద్దుటూరుకు చెందిన ఒక థియేట‌ర్ ప్ర‌క‌ట‌న అంటూ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్‌లో షేరింగుల మీద షేరింగులు ప‌డుతున్న ఈ పోస్ట‌ర్ ఉన్న ప‌రువును మ‌రింత‌గా దిగ‌జార్చుతున్న‌ట్టుగానే ఉంది.

శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్ర‌ణీత‌, కాజ‌ల్‌, స‌మంత‌, జ‌య‌సుధ న‌టించిన చిత్రం… అని పైన రాశారు బాగుంది. ఆ త‌రువాత వాక్య‌మే కొంప ముంచుతోంది. అదేంటంటే… ‘‘బోర్ సీన్స్ తీసినందువ‌ల్ల చూడ‌ద‌గ్గ  కుటుంబ క‌థా చిత్రం’’ అని రాశారు. ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవ‌డం అనేదే చాలామంది ప్ర‌శ్న‌. బోరు సీన్లు ద‌ర్శ‌కుడు తీసినందు వ‌ల్ల కుటుంబ క‌థా చిత్ర‌మైందా… లేదా, బోర్ సీన్స్ ని సినిమా నుంచి తొల‌గించ‌డం వ‌ల్ల ఈ చిత్రం కుటుంబ క‌థా చిత్రం అయిందా అంటూ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ల‌లో ఒక‌టే ఇక ఇక‌లు, ప‌క‌ప‌క‌లు! అస్స‌లే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాను జాగ్ర‌త్త‌గా ప్ర‌మోట్ చేసుకోవాలి. యాడ్స్ ఇచ్చేముందు ఒక‌టికి ప‌దిసార్లు చెక్ చేసుకోవాలి క‌దా అంటూ మ‌హేష్ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -