Saturday, May 18, 2024
- Advertisement -

ఆస్ట్రేలియా జ‌ట్టు కెప్టెన్ ప‌గ్గాలు వీళ్ల‌లో ద‌క్కేదెవ‌రికో…?

- Advertisement -

బాల్ టాంపరింగ్ వివాదంలో ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ డారెన్ లీమన్ పాత్ర లేదని క్రికెట్ ఆస్ట్రేలియా క్లీన్‌చిట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో శుక్రవారం ఆరంభమయ్యే చివరిదైన నాలుగో టెస్టు అనంతరం కోచ్ బాధ్యతల నుంచి దిగిపోనున్నట్లు ప్రకటించాడు.

త‌దుప‌రి జ‌ట్టు కెప్టెన్ వేట మొద‌లు పెట్టింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఇప్ప‌టికే కొంత మంది మాజీ ఆట‌గాళ్ల పేర్ల‌ను ప‌రిశీలించింది.

1. జస్టిన్ లాంగర్

మాజీ టెస్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ జస్టిన్ లాంగర్.. లీమన్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వెస్ట్రన్ ఆస్ట్రేలియా, పెర్త్ స్కార్చర్స్ జట్లకు కోచ్‌గా పనిచేశారు. 2016 కరీబియన్ టూర్‌లో వన్డే సిరీస్ కోసం పర్యటించిన ఆస్ట్రేలియా జట్టుకు లీమన్ స్థానంలో కోచ్‌గా వెళ్లాడు. గతేడాది సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు కూడా జట్టుతో ఉన్నాడు.

2. రికీ పాంటింగ్

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా కోచ్ రేసులో ఉన్నాడు. ఆ దేశం తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రికీ ముందున్నాడు. జట్టును సమర్థవంతంగా నడిపించిన సత్తా అతనిలో ఉంది. కోచ్‌గా పాంటింగ్‌కు అపారమైన అనుభవం ఉంది. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ టైటిల్ నెగ్గడంలో పాంటింగ్ పాత్ర ఎంతో ఉంది. ప్రస్తుతం 2018లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

3. జాసన్ గిలెస్పీ

ఆసీస్ పేస్ బౌలర్ జాసన్ గిలెస్పీ బిగ్‌బాష్ లీగ్‌లో అడిలైడ్ ైస్ట్రెకర్స్‌కు కోచ్‌గా పనిచేశాడు. గతంలో క్రికెట్ అస్ట్రేలియాకు కన్సల్టెంట్ కోచ్‌గా కూడా సేవలందించాడు. ఇంగ్లీష్ కౌంటీల్లో యార్క్‌షైర్‌కు కూడా పనిచేశాడు. బౌలింగ్‌లో మంచి అనుభవం ఆసీస్‌కు ఉపయోగపడనుంది.

4. డేవిడ్ సాకర్

ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ మెంటార్ డేవిడ్ సాకర్ గతేడాది భారత్‌లో పర్యటించిన ఆసీస్‌కు ప్రధాన కోచ్ బాధ్యతలు చేపట్టాడు. 2016-17 షెఫీల్డ్ షీల్డ్‌లో విక్టోరియా జట్టుకు పనిచేశాడు. ఏదో ఒక రోజు కచ్చితంగా ఆసీస్ జట్టుకు ప్రధాన కోచ్ పదవి చేపడతానని ఆశాభావం కూడా వ్యక్తం చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -