Saturday, May 4, 2024
- Advertisement -

‘ఎన్.టి.ఆర్’ సినిమాతో నంద‌మూరి కుటుంబంలో చీలిక‌

- Advertisement -

స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఓ మ‌హావృక్షంలాంటి వ్య‌క్తి. అయితే ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితంలోనూ ఆయ‌న కుటుంబం కూడా ఓ మ‌హావృక్షంలాంటిది. 8 మంది కుమారులు, న‌లుగురు కూతుళ్ల‌తో వ‌సుధైక కుటుంబంలా నంద‌మూరి వంశం ఉండేది. ఇంత గొప్ప కుటుంబంలో చీల‌క ఒక విష పురుగు వ‌ల‌న వ‌చ్చింద‌ని అంద‌రికీ తెలిసిందే. ఎన్టీఆర్ మ‌ర‌ణంతో ఆ కుటుంబంలో విబేధాలు తార‌స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు మ‌రోసారి ఆ విబేధాలు కొట్టిచ్చిన‌ట్టు క‌నిపిస్తున్నాయి.

న‌ట సార్వ‌భౌమ ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌పై ఆయ‌న త‌న‌యుడు బాల‌కృష్ణ ‘ఎన్.టి.ఆర్’ అనే సినిమాను తేజ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో గురువారం ఉద‌యం (మార్చి 29) హైద‌రాబాద్ నాచారంలోని రామ‌కృష్ణ స్టూడియోస్‌లో ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి నంద‌మూరి వంశస్తుల‌ను అంద‌ర్నీ పిల‌వాలి. కానీ వాటిని బాల‌కృష్ణ ప‌ట్టించుకోలేదు. త‌న‌కు న‌చ్చిన వాళ్ల‌ను పిలిచారు. తండ్రికి త‌గ్గ వార‌సుడిన‌ని స్వ‌యంగా ప్ర‌క‌టించుకుంటున్న బాల‌కృష్ణ నంద‌మూరి కుటుంబంలోని ప‌లువురిపై వివ‌క్ష సాగిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధానంగా హ‌రికృష్ణ కుటుంబంపైనే అని తెలుస్తోంది. ఈ విష‌యం సినిమా షూటింగ్ ప్రారంభ కార్య‌క్ర‌మం చూస్తుంటే తెలుస్తోంది.

ఈ కార్య‌క్ర‌మానికి నంద‌మూరి హ‌రికృష్ణ‌, ఆయ‌న త‌న‌యుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌నిపించ‌లేదు. వీరితో పాటు ప‌లువురు కుటుంబ‌స‌భ్యులను పిల‌వ‌నే లేదు. మ‌రి ఎందుకు పిల‌వ‌లేదు. తెలుగు దేశం పార్టీ ఒకరి చేతిలోకి వెళ్ల‌డంతో అప్ప‌టి నుంచి కుటుంబ‌స‌భ్యుల్లోని ప‌లువురిపై వివ‌క్ష కొన‌సాగుతోంది. పైగా ఇప్పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను టీడీపీలో కీల‌క స్థానం అప్ప‌గించాల‌నే డిమాండ్ రోజురోజుకు పెరుగుతుండ‌డంతో బాల‌కృష్ణ త‌న‌కు పోటీగా ఎక్క‌డ వ‌స్తాడోన‌నే ఉద్దేశంతో ఇప్పుడు ఆ కుటుంబాన్ని దూరం చేస్తున్నార‌ని తెలుస్తోంది.

నంద‌మూరి కుటుంబం మొత్తం వివ‌రాలు
కుమారులు
నంద‌మూరి రామ‌కృష్ణ సీనియ‌ర్‌ (స్వ‌ర్గీయులు)
నంద‌మూరి జ‌య‌కృష్ణ‌
నంద‌మూరి సాయికృష్ణ (స్వ‌ర్గీయులు)
నంద‌మూరి హ‌రికృష్ణ‌
నంద‌మూరి మోహ‌న‌కృష్ణ‌
నంద‌మూరి బాల‌కృష్ణ‌
నంద‌మూరి రామ‌కృష్ణ జూనియ‌ర్‌
నంద‌మూరి జ‌య‌శంక‌ర్ కృష్ణ‌

కుమార్తెలు
గార‌పాటి లోకేశ్వ‌రి
ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి
నారా భువ‌నేశ్వ‌రి
కంట‌మ‌నేని ఉమామ‌హేశ్వ‌రి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -