Sunday, May 19, 2024
- Advertisement -

కామన్వెల్త్ క్రీడ‌ల్లో సూప‌ర్ ల‌వ్ సీన్‌ …

- Advertisement -

నేటి యువత తమ ప్రేమను ప్రేయసికి వినూత్నంగా తెలిపిందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎత్తైన కొండ మీదకు తీసుకెళ్లడం, ఆమె కోసం ప్రత్యేకంగా ఏమైనా చేయడం వంటివి చేస్తూ తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ క్రీడాకారుడు కూడా తన ప్రేమను వ్యక్తపరిచేందుకు కామన్వెల్త్‌ క్రీడాగ్రామాన్ని వేదిక చేసుకున్నాడు ఇంగ్లాండ్ బాస్కెట్ బాల్ ప్లేయర్ జామెల్ అండర్సన్.

గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో తన గర్ల్‌ఫ్రెండ్, మహిళా బాస్కెట్ బాల్ టీమ్ ప్లేయర్ జార్జియా జోన్స్‌కి ప్రపోజ్‌ చేశాడు. ఈ బిగ్గెస్ట్ ఈవెంట్‌ను మరింత ప్రత్యేకంగా మార్చాడు. తన మనసుకు నచ్చినవాడే ఎదురొచ్చి ప్రపోజ్‌ చేస్తే ఏ అమ్మాయైనా కాదని ఎలా అంటుంది. జార్జియా కూడా సరిగ్గా అదే చేసింది. పైగా అండర్సన్ తమ జట్టు కామెరూన్‌ దేశంపై విజయం సాధించగానే జార్జియా వద్దకెళ్లి మోకాలిపై కూర్చోని సినిమా సీన్లను తలపించేలా.. తన ప్రేమ విషయాన్ని తెలిపాడు. దీంతో ఆమె వెంటనే అతడి ప్రపోస్‌కు ఓకే చెప్పేసింది. ఇంకేం.. తోటి క్రీడాకారుల సందడితో బాస్కెట్ బాల్ కోర్టు దద్దరిల్లిపోయింది.

అండర్సన్ తన లవ్‌ ప్రపోజల్‌కు పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నాడు. ప్రపోస్ చేయడానికి కాస్త ముందే ఆ విషయాన్ని తన టీమ్మేట్స్‌కు తెలిపాడు. దీంతో తన ప్రపోస్‌కు జోన్స్‌ ఒకే చెప్పగానే తోటి క్రీడాకారుల సహకారంతో అండర్సన్ ఆమెకు అక్కడే ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ కూడా తొడిగేశాడు. ఆ క్షణంలో ఇద్దరూ ఉద్వేగానికి గురయ్యాడు. తన తోటి క్రీడాకారులు చేసిన ఏర్పాట్ల వల్లే ఇంత చక్కగా తన గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్‌ చేయగలిగానని అండర్సన్‌ ఆనందం వ్యక్తం చేశాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -