ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ టీ20 వరల్డ్ కప్ తర్వాత క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన మనసు మార్చుకున్నారు వార్నర్. పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని సన్నిహితులతో చెప్పాడని తెలుస్తోంది.
క్రికెట్ ఆస్ట్రేలియా ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా ఆడతానని వెల్లడించారని తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి 1న వన్డేలకు.. జనవరి 10న టెస్టులకు వీడ్కోలు పలికాడు వార్నర్. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటానని వెల్లడించాడు.
ఇక తన వారసుడిగా జేక్ ఫ్రెజర్ మెక్ గుర్క్‌ను ప్రకటించి ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వచ్చే రెండు నెలల పాటు ఆస్ట్రేలియాకు అంతర్జాతీయ మ్యాచ్‌లు లేవు. సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో తలపడనుంది ఆసీస్. అయితే వార్నర్ కోరికను క్రికెట్ ఆస్ట్రేలియా మన్నిస్తుందా వేచిచూడాలి.